పౌరసరఫరాల సమస్యలపై ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్
ABN, First Publish Date - 2023-01-07T04:27:49+05:30
విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 1967 నంబరులో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటరు అందుబాటులోకి రానుంది.
అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 1967 నంబరులో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటరు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 18004250082/1967 (పౌరసరఫరాలశాఖ), 18004253157/14445 (ఒకే దేశం.. ఒకే రేషన్‌కార్డు), 18004252388/155235 (రాష్ట్ర ఆహార కమిషన్), 18004254202 (తూనికలు కొలతలశాఖ) టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా 1967 టోల్‌ఫ్రీ నంబరుతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటరును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలు, బియ్యం కార్డుల సేవలు, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బంకులు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి ఈ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే.. వాటిని నమోదు చేసుకుని వెంటనే ఆ ఫిర్యాదు నమోదు సంఖ్యను ఫిర్యాదుదారుకు తెలియజేస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వినియోగదారులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
Updated Date - 2023-01-07T04:27:50+05:30 IST