ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాని మోసం చేశారు

ABN, First Publish Date - 2023-01-29T00:57:11+05:30

తిరుపతి వెంకన్న సాక్షిగా మాట్లాడిన ప్రధాని మోదీ కేం ద్రంలో 8 ఏళ్ళు గడుస్తున్నా హోదా పై ఎక్కడా మాట్లా డకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ర్యాలీలో పాల్గొన్న చలసాని శ్రీనివాస్‌ తదితరులు

నర సరావుపేట టౌన, జనవరి 28 : తిరుపతి వెంకన్న సాక్షిగా మాట్లాడిన ప్రధాని మోదీ కేం ద్రంలో 8 ఏళ్ళు గడుస్తున్నా హోదా పై ఎక్కడా మాట్లా డకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రత్యేక హోదా, యువతకు విద్య, ఉపాధి అవకాశాల కోసం ఈ నెల 24న హిందూపురం ఉంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన సమర యాత్ర ప్రచార జాత శనివారం నరసరావుపేటకు చేరుకుంది. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌ నుంచి పట్టణంలోని ఏంజెల్‌ టాకీస్‌ వద్ద గల ధర్నా చౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభకు డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజ నేయరాజు అధ్యక్షత వహించారు. చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ యువగళం పేరుతో నారా లోకేశ చేస్తున్న పాదయాత్ర, వారాహి పేరుతో జనసేన అధ్యక్షుడు చేస్తున్న యాత్రలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని అన్నారు. అవసరమైతే పవన కళ్యాణ్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాదు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, కార్యదర్శి లేనినబాబు, పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌, కార్యదర్శి గనిరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర, కార్యదర్శి శివారెడ్డి, పల్నాడు జిల్లా కన్వీనర్‌ సుభాని, సీపీఎం నాయకుడు అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఈపూరి మస్తానరెడ్డి, కామినేని రామారావు, సిలార్‌ మసూద్‌, మస్తాన వలి, కే సాయి, కారుచోళ నవిత, సిద్దు, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T00:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising