ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్భీతిగా చంపేశాడు

ABN, First Publish Date - 2023-03-05T03:40:28+05:30

సమయం తెల్లవారుజాము కావస్తోంది. రెండు పదులు కూడా దాటని ఇద్దరు యువకులు స్కూటర్‌పై వచ్చారు. బూట్లు, జీన్స్‌ ఫ్యాంటు, టీ షర్టు వేసుకుని చూడటానికి దర్జాగా ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అకారణంగా గుంటూరు జంట హత్యలు

గంజాయి మత్తులో మైనర్‌ ఘాతుకం

గడ్డపారతో బాది దారుణంగా చంపేసిన వైనం

మరో మైనర్‌తో కలసి మారణకాండ

సీసీ కెమెరాలో హత్యల దృశ్యాలు రికార్డు

గుంటూరు, మార్చి 4: సమయం తెల్లవారుజాము కావస్తోంది. రెండు పదులు కూడా దాటని ఇద్దరు యువకులు స్కూటర్‌పై వచ్చారు. బూట్లు, జీన్స్‌ ఫ్యాంటు, టీ షర్టు వేసుకుని చూడటానికి దర్జాగా ఉన్నారు. ఓ యువకుడు స్కూటర్‌ వద్ద ఉండగా.. మాస్క్‌ పెట్టుకున్న మరో యువకుడు అక్కడ షోరూం ముందు కుర్చీలో కూర్చున్న వాచ్‌మన్‌ వద్దకు వచ్చాడు. వెనుక గడ్డపార దాచుకుని వచ్చిన ఆ యువకుడు ఎలాంటి కారణం లేకుండానే ఒక్కసారిగా గడ్డపారతో కొట్టి వాచ్‌మన్‌ను దారుణంగా చంపేశాడు. అతడిలో ఎలాంటి బెదురు, భయం కానీ లేదు. ఎందుకు చంపుతున్నాడో కూడా తెలియదు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వాచ్‌మన్‌ చనిపోయాడు. ఆ యువకుడు షోరూంలోకి వెళ్లి హెల్మెట్‌ తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఇద్దరూ స్కూటర్‌పై కొంతదూరం వెళ్లారు. ప్రభుత్వ లిక్కర్‌ స్టోర్‌ ముందు సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉండడం గమనించి ఆపారు. తొలుత మాస్క్‌ పెట్టుకున్న యువకుడే తలకు హెల్మెట్‌ పెట్టుకుని కూర్చీలో నిద్రపోతున్న సెక్యూరిటీ గార్డు వద్దకు వచ్చాడు. ఈ సారి కూడా వచ్చీరావడంతోనే గడ్డపారతో బాది ఆ సెక్యూరిటీ గార్డును కూడా చంపేశాడు. మృతులు ఇద్దరి దగ్గర ఎలాంటి బంగారు ఆభరణాలు లేవు. డబ్బు కూడా లేదు. వారితో ఆ యువకులకు ఎలాంటి గొడవ కూడా లేదు. ఎలాంటి కారణంగా లేకుండానే ఆ యువకుడు అతి కిరాతకంగా చంపేశాడు. కేవలం గంజాయి మత్తులో ఉన్మాదుల్లా ప్రవర్తించి ఇద్దరు అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ నెల 1వ తేదీన గుంటూరులో జరిగిన ఇద్దరు వాచ్‌మెన్‌ దారుణహత్యకు సంబంధించి సీసీ కెమెరాల్లో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా నమోదైన దృశ్యాలివి. హత్య జరిగిన తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. అదే రోజు రాత్రి మరో సెక్యూరిటీ గార్డుపైనా హత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే వారి బారి నుంచి తప్పించుకుని అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆయన జరిగిన విషయం చెప్పాడు. ఆ ముందు రోజు అంటే ఫిబ్రవరి 28న తెనాలిలో సీఎం పర్యటన ఉండడంతో పోలీసులందరూ బందోబస్తు విధులకు వెళ్లారు. ఓ కానిేస్టబుల్‌ మాత్రమే ేస్టషన్‌లో ఉన్నారు. ఆయన వెంటనే జీవు తీసుకొని ఘటనా స్థలానికి వచ్చారు. విషయం గమనించి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానిేస్టబుల్‌ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తమ చేతిలో ఉన్న గడ్డపార, హెల్మెట్‌ను విసిరేసి పారిపోయారు. గుంటూరుకు చెందిన 18 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల యువకుడితో కలసి ఈ మరణకాండ సాగించాడు. హంతకుడు గంజాయి, మత్తు బిళ్ళలు, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్ధాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో చిల్లర దొంగతనాలు చేస్తూ పోలీసుల రికార్డులకు ఎక్కాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అడపా దడపా చిల్లర దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. హత్యాకాండకు తెగబడిన ఇరువురినీ అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకొని జువనైల్‌ హోంకు తరలించారు.

Updated Date - 2023-03-05T03:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising