ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రౌండ్‌ ట్రూతింగ్‌, వెక్టారైజేషన్‌ త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2023-01-18T00:16:24+05:30

భూముల రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌, వెక్టారైజేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయా లని జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రీసర్వేపై సమీక్ష నిర్వహిస్తోన్న జేసీ రాజకుమారి

గుంటూరు, ప్రత్తిపాడు, జనవరి 17: భూముల రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌, వెక్టారైజేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయా లని జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశిం చారు. మంగళవారం ఆమె భూముల రీసర్వే పురోగతిని అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివన్నారాయణశర్మ, డిప్యూటీ కలెక్టర్‌ భాస్కర్‌నాయుడుతో కలిసి ప్రత్తిపాడు మండలంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడు తూ రీసర్వేలో భాగంగా జిల్లాలో 31 గ్రామాలకు రీసర్వే ఓఆర్‌ఐలు రాగా అందులో తొలి దశలో ఐదు గ్రామాల రీసర్వే జరిగి భూహక్కు పత్రాలు పంపిణీ చేశారన్నారు. మిగిలిన 26 గ్రామాలు మేడికొండూరులో 10, వట్టి చెరుకూరులో 13, ప్రత్తిపాడులో 2, దుగ్గిరాలలో ఒక గ్రామం ఉందన్నారు. మేడికొండూరు మండలంలో 9 గ్రామాల గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయిందని, నాలుగు గ్రామాలు వెక్టారైజేషన్‌లో ఉన్నాయన్నారు. 2 గ్రామాలు సరిహద్దు, ప్రభుత్వ భూముల రీఫిక్సింగ్‌ చేస్తున్నామన్నారు. ఒక గ్రామానికి గ్రౌండ్‌ ట్రూతింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. వట్టిచెరుకూరు మండలంలో 13 గ్రామాలకు 9 చోట్ల గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయిందన్నారు. 2 గ్రామాల్లో ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు. నాలుగు గ్రామాల్లో వెక్టారైజేషన్‌ ప్తూయిందని చెప్పారు. మరో రెండు గ్రామాల వెక్టారైజేషన్‌ జరుగుతుండగా ఇంకా 2 గ్రామాలకు ఓఆర్‌ఐలు రావాల్సి ఉందన్నారు. దుగ్గిరాలలోని ఒక గ్రామంలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ జరుగుతోందని, ప్రత్తిపాడులో ఒక గ్రామం గ్రౌండ్‌ ట్రూతింగ్‌ అయి వెక్టారైజేషన్‌ జరుగుతోండగా మరో గ్రామం సిద్ధం గా ఉందన్నారు. ఈ సమీక్షలో ప్రత్తిపాడు తహసీల్దార్‌ ఎం లీల సంజీవ కుమారి, ఇన్‌చార్జ్‌ డీఎస్‌ఎల్‌వో సీహెచ్‌ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising