ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN, First Publish Date - 2023-01-18T00:11:28+05:30
రాష్ట్రంలో ఎ న్నికలకు ఎక్కువ సమ యం లేదని, ప్రజల సమ స్యలను జగన ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిం దని, నిత్యవసర ధరలు, కరెంటు చార్జీల పెరుగుద ల, గ్రామాల పరిధిలోని వార్డుల్లో ఏవిధమైన అభి వృద్ధి లేకపోవటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట అర్బన, జనవరి 17 : రాష్ట్రంలో ఎ న్నికలకు ఎక్కువ సమ యం లేదని, ప్రజల సమ స్యలను జగన ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిం దని, నిత్యవసర ధరలు, కరెంటు చార్జీల పెరుగుద ల, గ్రామాల పరిధిలోని వార్డుల్లో ఏవిధమైన అభి వృద్ధి లేకపోవటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పుల్లారావు తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వార్డు అధ్యక్ష, కార్యదర్శులు, బూత కమిటీ కన్వీనర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన గురించి చర్చించి నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశ, నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన సమద్ ఖాన, నియోజకవర్గ సమన్వయ కర్త నెల్లూరి సదాశివరావు, చిలకలూరి పేట విద్యా సంఘం చైర్మన తేళ్ళ సుబ్బారావు, 11, 12 వార్డు అధ్యక్ష, కార్యదర్శులు కల్లి వీరారెడ్డి, బెజ్జం రవి, వడ్డాని సుబ్బారావు, నూలు రాజేష్, బూత కమిటీ కన్వీనర్లు మానుకొండ సుధాకరరెడ్డి, మువ్వా రవీందర్‌రెడ్డి, షేక్ అబ్దుల్ మజీద్, కంపసాటి ప్రతాప్, గట్టుపల్లి మాణిక్యాలరావు, జరుగుమల్లి చెన్నయ్యపాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:11:33+05:30 IST