ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్యాష్‌బోర్డుతో ముఖాధారిత హాజరు అనుసంధానం

ABN, First Publish Date - 2023-01-25T04:00:42+05:30

ఉద్యోగుల ముఖ హాజరును ప్రభుత్వం స్టేట్‌లెవల్‌ డ్యాష్‌ బోర్డుతో అనుసంధానం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనిఖీలకు నోడల్‌ అధికారులకు అనుమతి

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ముఖ హాజరును ప్రభుత్వం స్టేట్‌లెవల్‌ డ్యాష్‌ బోర్డుతో అనుసంధానం చేసింది. ఉద్యోగుల హాజరు నమోదును రాష్ట్రస్థాయి డ్యాష్‌ బోర్డు ద్వారా తనిఖీ చేసేందుకు ఆయా శాఖల విభాగాధిపతులు, హెచ్‌వోడీలు, జిల్లాస్థాయిలో కలెక్టర్లకు అనుమతి ఇస్తూ బుధవారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ ఆధారిత హాజరును ఆయాశాఖల నోడల్‌ అధికారులు డ్యాష్‌బోర్డుకు కనెక్టై చూసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆయా శాఖల నోడల్‌ అధికారు లు డ్యాష్‌బోర్డు ద్వారా హాజరును మానిటరింగ్‌ చే యాలని ఆదేశించింది. కాగా, ఐటీ శాఖ రూపొందించిన ముఖ ఆధారిత హాజరు యాప్‌ ద్వారా... హాజరు నమోదు చేసుకోలేకపోతున్న కొన్ని శాఖల ఉద్యోగులకు... ఆయా శాఖలు సొంతంగా వాడుతున్న ముఖాధారిత ఫేషియల్‌ సిస్టమ్‌(ఎ్‌ఫఆర్‌ఎస్‌) యాప్‌ ద్వా రానే ప్రస్తుతానికి హాజరు నమోదుకు అవకాశం కల్పి స్తూ బుధవారం సాధారణ పరిపాలనా శాఖ మెమో జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయా విభాగాలు రూపొందించుకున్న యాప్‌ ద్వా రానే హాజరు నమోదుకు ఆదేశాలు ఇచ్చింది. వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖలోని వివిధ విభాగాలు పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్‌శాఖలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఉద్యోగులు, పురపాలక శాఖల ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆయా శాఖల సొంత యాప్‌ల ద్వారా హాజరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Updated Date - 2023-01-25T04:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising