పీఆర్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం
ABN, First Publish Date - 2023-07-30T02:38:05+05:30
ఏపీ పీఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా దేవరకొండ వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షుడిగా జి.వి. నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.వి.ఎన్.ప్రసాదరావు ఎన్నికయ్యారు.
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఏపీ పీఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా దేవరకొండ వెంకట్రావు, రాష్ట్ర అధ్యక్షుడిగా జి.వి. నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.వి.ఎన్.ప్రసాదరావు ఎన్నికయ్యారు. శనివారం విజయవాడలో ఆ సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం రాష్ట్రంలోని జడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, డివిజన్ అఽభివృద్ధి అధికారులు, ఎంపీడీఓల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని, ఎంపీడీఓ పోస్టు పేరును బ్లాక్ డెవల్‌పమెంట్ ఆఫీసర్(బీడీఓ)గా మార్పు చేయాలని ఈ సందర్భంగా కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. ఎంపీడీఓలకు, పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఎంపీడీఓలుగాను పదోన్నతులు ఇవ్వడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది.
Updated Date - 2023-07-30T02:38:05+05:30 IST