ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,3 నెలలు అటూ ఇటూ అయినా.. రాష్ట్రంలో సంక్షేమం అమలు చేస్తున్నాం

ABN, First Publish Date - 2023-03-25T03:11:13+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేసిన జగన్‌

2023-24 బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం

ముగిసిన సమావేశాలు..సభ నిరవధిక వాయిదా

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు. తమ ప్రభుత్వం గత నాలుగు బడ్జెట్‌లలో ఏం చెప్పిందో.. ఆ ప్రకారమే నిధులు విడుదల చేసి సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. 2023-24 బడ్జెట్‌లో కూడా అదే ఫిలాసపీ కొనసాగిస్తూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ సంక్షేమ పథకాలకు ఏఏ నెలల్లో నిధులు విడుదల చేసేది వివరిస్తూ రూపొందించిన 2023-24 సంక్షేమ క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. రెండు, మూడు నెలలు అటూఇటూ అయినా గత నాలుగేళ్లుగా సంక్షేమ క్యాలెండర్‌ను కచ్చితంగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్‌లో ఏ నెలలో.. ఏఏ పథకాలకు బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారో సీఎం వివరించారు. అనంతరం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసినట్లుగా స్పీకరు తమ్మినేని సీతారాం ప్రకటించి.. సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Updated Date - 2023-03-25T03:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising