ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, First Publish Date - 2023-02-10T00:11:30+05:30
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దీని దృష్ట్యా నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి
గుంటూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దీని దృష్ట్యా నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో వేలాది పోస్టులను భర్తీ చేస్తోందన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కలెక్టర్, జేసీలతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ బాలికలు, మహిళల్లో రక్తహీనత ఉన్న వారిని గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి అవ సరమైన ఆహారం, మందులపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల న్నారు. పిల్లలకు ఐరన్, క్యాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి మార్చి 2వ తేదీ నుంచి జగనన్న గోరు ముద్ద భోజన పథకంలో రాగి జావ అందించనున్నట్లు చెప్పారు. ఆధార్ అప్‌డేషన్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టా లని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా అందిస్తోన్న వైద్య సేవలలో ఉన్న ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాల న్నారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందన అర్జీలు రీఓపెన్ కాకుండా చూసుకోవాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి, జడ్పీ సీఈవో మోహన్‌రావు, సీపీవో శేషశ్రీ, డీఎంహెచ్‌వో డాక్టర్ హన్మంతరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అన్న పూర్ణ, డీపీఎంవో డాక్టర్ రత్న మన్మోహన్, ఐసీడీఎస్ పీడీ మనోరంజని, పంచాయతీరాజ్ ఎసీఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-02-10T00:11:37+05:30 IST