పోలీస్ శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా?
ABN, First Publish Date - 2023-02-21T03:15:25+05:30
రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసేశారా లేక వైసీపీలో విలీనం చేశారా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
గన్నవరం ఘటనపై చంద్రబాబు మండిపాటు
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసేశారా లేక వైసీపీలో విలీనం చేశారా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘‘గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రం గా ఖండిస్తున్నాం. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్‌రెడ్డి ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు ఇంత అరాచకం సృష్టిస్తుంటే పోలీస్ అధికారులు ఏం గాడిదలు కాస్తున్నారు?గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
డీజీపీకి లేఖ
గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనపై చంద్రబాబు సోమవారం రాత్రి డీజీపీకి లేఖ రాశారు. దానిలో... ‘‘ఏపీలో వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తలు, నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడి చేసి, కార్యాలయాన్ని ధ్వంసం చేసి, కంప్యూటర్లు, పర్నీచర్ ధ్వంసం చేసి, అద్దాలు పగులగొట్టారు. అక్కడున్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. అంత విధ్వంసం జరుగుతున్నా... అక్కడున్న పోలీసులు, రౌడీమూకను నియంత్రించకుండా ప్రేక్షకపాత్ర పోషించారు. దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. బీసీ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ నేత దొంతు చిన్నా ఇంటిపై వైసీపీ గూండాలు దాడి చేశారు. ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే మా నేత పట్టాభిరామ్‌ను గన్నవరం పోలీ్‌సస్టేషన్ సమీపంలో గుర్తుతెలియనివ్యక్తులు కిడ్నాప్ చేశారు. పట్టాభిని నిజంగా పోలీసులు అరెస్టు చేశారా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? పట్టాభి భార్య తన భర్త భద్రత గురించి ఆందోళన చెందుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకోసం దోషులను అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.
వైసీపీ సమాధికి ఇటుక లెక్క: లోకేశ్
గన్నవరంలో టీడీపీ ఆఫీ్‌సపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. టీడీపీపై జగన్‌రెడ్డి చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క అని ఆయన హెచ్చరించారు.
వంశీ తలపొగరు అణిచేస్తాం: అచ్చెన్న
గన్నవరం దాడికి వల్లభనేని వంశీయే సూత్రధారి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆరోపించారు. ‘‘వంశీ..ఒక్క ఏడాది ఓపిక పట్టు.. నీతల పొగరు అణిచేస్తాం..’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం వెంటలేటర్‌పై ఉందని మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్‌రెడ్డీ..ఓటమి భయం పట్టుకునే.. ఇటువం టి దుశ్చర్యలకు పాల్పడుతున్నావు’ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిం చి.. వంశీ తన ఓటమికి తనే శాసనం రాసుకున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరి విమర్శించారు.
Updated Date - 2023-02-21T03:15:26+05:30 IST