ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణం నిలిచినట్లేనా?

ABN, First Publish Date - 2023-03-11T00:17:24+05:30

డీఈవో వెంకటప్పయ్యపై వేటుతో విరాళాలతో నిర్మిస్తున్న విద్యాశాఖ జిల్లా కార్యాలయ పనులపై మీమాంశ నెలకొంది. కార్యాలయం నిర్మాణం కోసం డీఈవో హోదాలో వెంకటప్పయ్య సొంతంగా విరాళాలు వసూలు చేసి పనులు చేపట్టారు.

కలెక్టరేట్‌ పక్కనే నిర్మాణంలో పల్నాడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నరసరావుపేట, మార్చి 10: డీఈవో వెంకటప్పయ్యపై వేటుతో విరాళాలతో నిర్మిస్తున్న విద్యాశాఖ జిల్లా కార్యాలయ పనులపై మీమాంశ నెలకొంది. కార్యాలయం నిర్మాణం కోసం డీఈవో హోదాలో వెంకటప్పయ్య సొంతంగా విరాళాలు వసూలు చేసి పనులు చేపట్టారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు లేకుండా పూర్తిగా దాతల విరాళాలతోనే స్థానిక కలెక్టరేట్‌ పక్కనే కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గురువారం ప్రభుత్వం వేటు వేసింది. ఈ పరిస్థితుల్లో కార్యాలయ భవన నిర్మాణం నిలిచిపోయినట్లేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే డీఈవో కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన భారీగా చందాలు, విరాళాలు వసూలు చేశారని సమాచారం. ఈ చందాలు, విరాళాల వసూళ్లపై అనేక విమర్శలు, సందేహాలు నెలకొన్నాయి. ఎన్నో విమర్శలు వచ్చినా నేటి వరకు వసూళ్ల వివరాలు ప్రకటించలేదు. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత విరాళాల వివరాలు ప్రకటిస్తానని ఇటీవల వెంకటప్పయ్య తెలిపారు. వెంకటప్పయ్య రిలీవ్‌ అయ్యే సమయంలో విరాళాల వివరాలు ప్రకటిస్తారా మిన్నకుంటారో చూడాలి. కొత్త డీఈవోకు కార్యాలయ నిర్మాణ వ్యయం, విరాళాల వివరాలు అందజేయాల్సి ఉంటుంది. విరాళాల జాబితాను కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తే అనుమానాలకు తావులేకుండా ఉంటుంది.

తొలి నుంచి అనుమానాలు..

విద్యాశాఖ జిల్లా కార్యాలయ నిర్మాణంపై అనేక అనుమాలున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మిస్తున్నారు. దాతలు విరాళాలు ఇచ్చినా ప్రభుత్వ అనుమతితో టెండర్‌ పద్ధతిలో కార్యాలయ భవనాన్ని నిర్మించాలి. చట్టాలను అమలు చేయాల్సిన డీఈవో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు. పైగా కలెక్టర్‌ అనుమతులు ఇచ్చారని ఆయన చెబుతూ వచ్చారు. విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా ఆయన పట్టించుకోకుండానే భవన నిర్మాణాన్ని చేపట్టారు. విరాళాల విషయంలోనూ ఆయన భిన్నమైన ప్రకటనలు చేశారు. తొలుత ఎంపీ, ఎమ్మెల్యేలు విరాళాలు ఇచ్చారని, తదుపరి కార్యాలయ ఉద్యోగులే రూ.10 లక్షలు విరాళం ఇచ్చారని డీఈవో గతంలో ప్రకటించారు. అయితే ఇవేవీ అధికారికంగా వెల్లడికాలేదు.

Updated Date - 2023-03-11T00:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising