ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు పదవులతో బడుగుల కడుపు నిండుతుందా?: టీడీపీ

ABN, First Publish Date - 2023-02-21T03:47:52+05:30

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి నాలుగు పదవులు ఇస్తే ఆ వర్గాలవారి కడుపు నిండుతుందా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి నాలుగు పదవులు ఇస్తే ఆ వర్గాలవారి కడుపు నిండుతుందా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ మానవ వనరుల విభాగం అధ్యక్షుడు, విశ్రాంత ఐఎఎస్‌ అధికారి బూర్ల రామాంజనేయులు సోమవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో సరాసరి ఏడాది బడ్జెట్‌ రూ.2.29 లక్షల కోట్లు. టీడీపీ హయాంలో ఏడాది సరాసరి బడ్జెట్‌ రూ.1.40 లక్షల కోట్లు. అంత తక్కువ బడ్జెట్‌లో కూడా టీడీపీ ప్రభుత్వం మూడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాలకు రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్‌ పెరిగినా వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వెసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అతి ప్రధానమైన సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తుంగలో తొక్కింది. పన్నులు, బాదుళ్లతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆ మేరకు బడుగు వర్గాలకు నిధుల కేటాయింపు మాత్రం పెంచలేదు. నవరత్నాల పథకాలనే చూపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి న్యాయం చేశానని సీఎం జగన్‌రెడ్డి కబుర్లు చెబుతున్నారు’’ అని రామాంజనేయులు ఆరోపించారు.

Updated Date - 2023-02-21T03:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising