భోగి కాంతులు
ABN, First Publish Date - 2023-01-15T00:47:41+05:30
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగిని అన్ని వర్గాల ప్రజలు శనివారం సందడిగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారు స్వగ్రామాల్లో మిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేసుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
భోగ భాగ్యాల భోగిని చిన్నా పెద్ద తార తమ్యం లేకుండా ప్రజలు ఉత్సాహం గా జరుపుకున్నారు. శనివారం తెల్లవారుజామునే ప్రధాన కూడళ్లతో పాటు ఇళ్ల ముంగిళ్లలో భోగి మంటలు వేసుకుని సంక్రాంతి సంబరా లను వేడుకగా ప్రారంభించా రు. భోగీ మంటలు.. బొమ్మల కొలువులు.. భోగి పండ్లు.. గం గిరెద్దుల విన్యా సాలతో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా సంబరాలు అంబ రాన్ని అంటేలా చేసుకు న్నారు. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజా ప్రతి నిధులు భోగి కార్యక్రమా లను వేడుకగా జరుపు కున్నారు. ఇక బాపట్ల జిల్లా తీర గ్రామాల్లో సం ప్రదాయ ముసుగులో కోడి పందే లు భారీగా జరిగాయి. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కోడి పందేలకు ఉ మ్మడి గుంటూరుతో పాటు సమీ ప జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి జూదరులు వచ్చి రూ.లక్ష ల్లో పందేలు కాశా రు. ఇక ఈ పం దేలను చూసేందుకు వచ్చిన వారు, వారి వాహనాలతో తీర ప్రాంత పల్లెల్లో సందడి నెలకొంది.
నరసరావుపేట, జనవరి 14: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగిని అన్ని వర్గాల ప్రజలు శనివారం సందడిగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారు స్వగ్రామాల్లో మిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేసుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా దూరమైన సంక్రాంతి సందడి ఈ ఏడాది కనిపించింది. పిండి వంటల ఘుమఘుమలు, బంధువులు, కుటుంబసభ్యుల సందడితో పల్లెలు శోభిల్లాయి. కుల, మతాలకు అతీతంగా రైతులు, వ్యవసాయ కూలీలు జరుపుకునే పండుగ కావడంతో సంక్రాంతి పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారితో పాటు బంధువుల రాకతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకుంది. పల్లెల్లో ముగ్గుల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, మ్యూజికల్ చైర్స్, యువకులు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. భోగి మంటల అనంతరం దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇళ్ల ముందు ఒకరికొకరు పోటీ పడి భోగి ముగ్గులతో తీర్చిదిద్దారు. ఆ ముగ్గులను గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గాలి పటాలను ఎగుర వేసి ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలకు పెద్దలు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. అయ్యప్ప స్వాములు మకర జ్యోతి దర్శ నం, పడి పూజా కార్యక్రమం, అయ్యప్ప స్వామి భజనలు చేశా రు. భోగి పండుగ నేపథ్యం లో దేవాలయాలు, కిటకిటలాడా యి. భక్తులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేసు కుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పలు ఆలయాల్లో శనివారం సాయంత్రం గోదాదేవి శాంతి కల్యాణాలు వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణోత్సవాలు జరిగాయి. అనంతరం జరిగిన గ్రామోత్స వాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నరసరావుపేట లో భోగి మంటలు వద్ద యువకులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. పట్టాభి రామస్వామి దేవాలయం, ప్రకాష్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం, బరంపేట లోని శ్రీలీలా వెంకటేశ్వర స్వామి, మార్కెట్ సెంటర్‌లోని భావన్నారాయణ స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వ హించి స్వామి ఊరేగింపును నేత్ర పర్వంగా నిర్వహించారు. ఎన్‌జీవో కాలనీ, వెంకటేశ్వర స్వామి ఆల యం, కోటప్ప కొండ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆల యంలో శ్రీవారికి వైభవంగా కల్యాణోత్సవాలు నిర్వహించా రు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కనులారా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలను తిలకించారు. పాండు రంగ స్వామి ఆలయం, పాతూరు, మునిసిపల్ కార్యాలయంలోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
నరసరావుపేట కల్చరల్: పట్టణంలో అధికారికంగా సం క్రాంతి సంబరాలు జరిగాయి. కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంప్రదాయ దుస్తుల్లో హాజరై బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ ప్రాంగణంలో భోగి మంటలు వేశా రు. అనంతరం పట్టణంలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరిగే కార్యక్రమాలకు కలెక్టర్, ఎమ్మెల్యే ఇద్దరు హాజరయ్యారు. హరిదాసు సంకీ ర్తనలు, సన్నాయి మేళాలు, కనక తప్పె ట్లతో జరిగిన ఊరేగింపులో వారు పాల్గొ న్నారు. గంగిరె ద్దుల ఆటలను, మహిళల కోలాటాన్ని, బొమ్మల కొలువు లు, డీఆర్‌డీఏ, మెప్నా, వైద్య ఆరోగ్య, ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకు న్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు వారు ఏర్పాటు చేసిన భోగి పండ్లు కార్యక్రమంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించా రు. మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్ర మంలో డీఆర్వో వినాయకం, సంక్రాంతి సంబరాల కార్యక్ర మాల సమన్వయ కర్త బాలూనాయక్, ఉద్యాన శాఖ అధి కారి డీజే బెన్ని, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు.
సామూహికంగా వేడుకలు..
సంక్రాంతి వేడుకలు పలు గ్రామాల్లో సామూహికంగా జరుపుకున్నారు. ఇక పట్టణాల్లో అయితే అపార్టుమెంట్ల లోనూ అందరూ కలిసి భోగి మంటలు వేసుకుని సంక్రాం తి సంబరాలను ప్రారంభించారు. దుగ్గిరాలలో దోస్త్‌సేవాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రైలుపేటలోని నేతాజీ బోస్‌బొమ్మ సెంటర్‌లో భోగిమంటలు వేసి, మహిళలు, చిన్నారుల చేసిన కోలాటాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామంలో ఎద్దులబండి ఊరేగింపు ముందురాగా డిగ్రీ కళాశాల ఆవరణ వరకూ 2కె రన్ నిర్వహించారు. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో శివశక్తి ఫౌండేషన్ ఎండీ నందిగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు ఉదయం పాటలు పాడుతూ భోగి మంటలు వేశారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వ హించారు. మధ్యాహ్నం మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
Updated Date - 2023-01-15T00:47:44+05:30 IST