ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డిని బీసీలు నమ్మరు: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2023-02-21T03:48:30+05:30

కోట్ల మంది బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కారు. తల్లకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. జగన్‌రెడ్డిని బీసీలు నమ్మరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘‘కోట్ల మంది బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కారు. తల్లకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. జగన్‌రెడ్డిని బీసీలు నమ్మరు. వైసీపీకి మళ్లీ ఓటేసేదే లేదు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ఒకరిద్దరికి పదవులిచ్చి, రాజకీయంగా వాడుకున్నంత మాత్రాన జగన్‌రెడ్డిని బీసీలు నమ్మే పరిస్థితి లేదు. నలుగురికి పదవులివ్వడం బీసీలను ఉద్ధరించినట్లా? బీసీలకు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో దక్కిన 33ు రిజర్వేషన్లను కుదించి, 16,800 మందికి పదవులు రాకుండా చేసిన జగన్‌రెడ్డికి బీసీల ఊసెత్తే అర్హత లేదు. సుమారు 26 మంది బీసీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వందల మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. బీసీల అభ్యున్నతికి ఖర్చు చేయాల్సిన రూ.34 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధుల్ని మళ్లించారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్‌ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. బీసీలకు మేలు చేసే 30కి పైగా పథకాలను నిలిపివేశారు’’ అని ఆరోపించారు.

Updated Date - 2023-02-21T03:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising