ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Syllabus : సిలబస్‌తో చెడుగుడు!

ABN, First Publish Date - 2023-09-22T03:27:00+05:30

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాల్సిన సిలబ్‌సపై వైసీపీ సర్కారు మాట తడబడుతోంది.

సీబీఎస్‌ఈ, ఐబీ పేరిట గజిబిజి

సీబీఎస్‌ఈ గుర్తింపు సాధనలో ఘోర వైఫల్యం

2024 నాటికి 45 వేల బడుల్లో అమలు చేస్తాం

ఆర్భాటంగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం

ఇంకా 1,096 బడులకే గుర్తింపుతో నిరుత్సాహం

దాన్ని కప్పిపుచ్చేందుకు కొత్తగా ఐబీ బాటలోకి

అంతర్జాతీయ సిలబస్‌ అమలుకు ఆదేశాలు

తొలుత అన్ని బడుల్లోనూ ఐబీనే అని గొప్పలు

ఇప్పుడు దశల వారీగా అమలు అంటూ వెనక్కి

వచ్చే ఏడాది నుంచి మూడు రకాల సిలబస్‌లు?

‘‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2024 నాటికి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుచేయాలి. దశల వారీగా మొత్తం పాఠశాలలను అందులోకి మార్చాలి’’

- రెండేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యమిది.

‘‘మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి. వారు పొందే సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా ఎక్కడకి వెళ్లినా విలువ ఉండాలి. అందుకోసం అంతర్జాతీయ సిలబస్‌ (ఇంటర్నేషనల్‌ బకాలరియేట్‌) అమలు చేయాల్సిన అవసరం ఉంది’’

- ఈ ఏడాది ఆగస్టు

14న జరిగిన సమీక్షలో సీఎం జగన్‌.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాల్సిన సిలబ్‌సపై వైసీపీ సర్కారు మాట తడబడుతోంది. మొదట సీబీఎ్‌సఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని పెట్టుకున్న లక్ష్యంలో విఫలమైంది. ఆ వైఫల్యాన్ని అంగీకరించేందుకు ఇష్టపడని ప్రభుత్వం... గతనెలలో అంతర్జాతీయ సిలబ్‌సను తెరపైకి తీసుకొచ్చింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తం ఐబీ సిలబస్సే అన్నట్టుగా ప్రచారం చేసింది. తీరా అదీ సాధ్యం కాదని తెలియడంతో ఇప్పుడు దశల వారీగా అమలుచేయాలంటూ కొత్త పాట ఎత్తుకుంది. ఒకవేళ వచ్చే ఏడాది నుంచి ఐబీ అమలుచేస్తే సీబీఎ్‌సఈని వదిలేస్తారా? లేకపోతే స్టేట్‌, సెంట్రల్‌, ఇంటర్నేషనల్‌... మూడు రకాల సిలబ్‌సలూ అమలు చేస్తారా? ఒకే రాష్ట్రంలో మూడు సిలబ్‌సలు ఉంటే విద్యార్థులు వాటిలో ఏది చదవాలి? వారికి జారీచేసే సర్టిఫికెట్ల పరిస్థితేంటి?... ప్రభుత్వ విధానంపై ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు సిలబ్‌సలపై సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మైలేజీ కోసం రోజుకో సిలబస్‌ పేరుతో అధికార పార్టీ నేతలు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

1,096 బడులకే సీబీఎ్‌సఈ గుర్తింపు

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో స్టేట్‌ సిలబస్‌ ఒక్కటే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీబీఎ్‌సఈ అమలు చేస్తామని ప్రకటించింది. దశల వారీగా 2024 నాటికి మొత్తం 45వేల పాఠశాలలనూ అందులోకి మార్చేస్తామని పేర్కొంది. అనేక ప్రయత్నాల అనంతరం గతేడాదికి సీబీఎ్‌సఈ గుర్తింపు సాధించిన బడుల సంఖ్య 1,096 మాత్రమే. మరో ఏడాదిలో మిగిలిన 44వేల పాఠశాలలకు సీబీఎ్‌సఈ సాధించాల్సి ఉంది. సరైన ప్రమాణాలు లేకపోవడంతో ఈ సంవత్సరం ఒక్క పాఠశాలకు కూడా సీబీఎ్‌సఈ గుర్తింపు దక్కలేదు. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి లేఖ కేంద్రానికి లేఖ రాసినా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సీబీఎ్‌సఈ గుర్తింపు సాధించడంలో ఘోరంగా విఫలమయ్యామని ప్రభుత్వానికి బోధపడింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ సిలబ్‌సను తెరపైకి తెచ్చింది.

అమలే ఆలస్యం అన్నట్టుగా

గతనెలలో ఐబీ అనే పదాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలన్నారు. ఇందుకోసం వెంటనే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్క ఐబీ సిలబస్‌ మాత్రమే ఉంటుందన్న స్థాయిలో ప్రచారం చేశారు. కానీ నెల రోజులు గడిచినా దానిపై ఎలాంటి కదలిక లేదు. దీంతో మళ్లీ ఇప్పుడు మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలని కొత్తగా ఆదేశించారు. అది కూడా వచ్చే ఏడాది అన్ని పాఠశాలలకూ కాదని, కేవలం కొన్నింటికేనని స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రస్తుతం సీబీఎ్‌సఈ అమలవుతున్న 1,096 పాఠశాలలను ఏం చేస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఒకేసారి మూడు సిలబ్‌సలు అమలుచేస్తే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు అసలు అంతర్జాతీయ సిలబస్‌ ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఐబీ సిలబస్‌ చదివే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఎవరు జారీచేస్తారో తెలియదు. ఆ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎంత విలువ ఉన్నా, జాతీయ స్థాయిలో పనికొస్తుందా... అంటే అనుమానమే. ఎందుకంటే పదో తరగతి చదివిన వెంటనే విద్యార్థులంతా విదేశాలకు వెళ్లరు. మరి టెన్త్‌ సర్టిఫికెట్‌కు ఇతర రాష్ర్టాల్లో వెయిటేజీ ఉంటుందో, లేదో... అనే విషయమై ప్రభుత్వానికీ స్పష్టత లేదు. ఇన్ని గందరగోళాల మధ్య సిలబ్‌సపై ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2023-09-22T03:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising