లింగమనేని రమేశ్‌కు పత్రాలు ఇవ్వండి
ABN, First Publish Date - 2023-06-07T03:37:33+05:30
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్ జప్తుపై ప్రస్తుతం ఉన్న దశలో ఆదేశాలు ఇవ్వలేమని సీఐడీ కోర్టు తేల్చిచెప్పింది.
● సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు
విజయవాడ, జూన్ 6(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్ జప్తుపై ప్రస్తుతం ఉన్న దశలో ఆదేశాలు ఇవ్వలేమని సీఐడీ కోర్టు తేల్చిచెప్పింది. జప్తుపై విచారించే అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని పేర్కొంది. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను జప్తు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తవ్వడంతో న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన అధికారిని పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. సీఐడీ కోరినట్టుగా జప్తునకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపారు. సీఐడీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన పత్రాలను లింగమనేని రమేశ్‌కు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. లింగమనేని రమేశ్ తరఫున న్యాయవాది సోము కృష్ణమూర్తి దాఖలు చేసిన రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌ను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు.
Updated Date - 2023-06-07T03:37:33+05:30 IST