ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా అరెస్టును ఆపండి

ABN, First Publish Date - 2023-06-07T03:40:20+05:30

వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొట్టడంతోపాటు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, డీలర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న కేసులో నిందితుడిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ కోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● ముందస్తు బెయిలివ్వండి.. ఉద్యోగ సంఘం నేత కేఆర్‌ పిటిషన్‌

విజయవాడ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొట్టడంతోపాటు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, డీలర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న కేసులో నిందితుడిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆపాలని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. విజయవాడలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో మంగళవారం దాఖలైన ఈ పిటిషన్‌ను ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ 9న జరగనుంది. వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులు కె. సంధ్య, బి. మెహర్‌ కుమార్‌, వెంకట చలపతి, సత్యనారాయణపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్‌ రిపోర్టులో కేఆర్‌ను ఏ5గా చేర్చారు. ఈ క్రమంలో సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లారు.

Updated Date - 2023-06-07T03:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising