ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడప గడపలో నిలదీతలు

ABN, First Publish Date - 2023-01-29T03:02:11+05:30

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా నిలదీతలు ఎదురయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి

ఆదోని రూరల్‌/కర్నూలు(న్యూసిటీ), జనవ రి 28: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా నిలదీతలు ఎదురయ్యాయి. కర్నూలు జి ల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూ లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఆదోని మండలం మాంత్రికి గ్రామం లో సాయిప్రసాద్‌రెడ్డి పర్యటించారు. తన కొడుకుకు కంప్యూటర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటే తమ పీఏ అంజాద్‌బాషాకు 2019లో రూ.4 లక్షలు ఇచ్చానని రాముడు, మరో బాధితుడు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. డబ్బులు ఇచ్చిన 15 రోజుల తరువాత పీఏ చనిపోయాడని, తమకు న్యా యం చేయాలని కోరారు. మధ్యవర్తిగా వ్యవహరించిన స్థానిక ముఖ్య నాయకులపై ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. బాడుకవ్‌ పని చేయొద్దంటే తనకు తెలియకుండా ఇలాంటి పనులు ఎలా చేస్తారని మండిపడ్డారు. అంతకుముందు తాయమ్మ ఇంటికెళ్లిన ఎమ్మెల్యేకు ఇల్లు కట్టి సంవత్సరమైనా బిల్లు ఇవ్వలేదని వాపోయింది. అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే ఎలా అంటూ అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. సొంత ఇంటికి పట్టా ఎందుకివ్వరంటూ దస్తగిరమ్మ అనే మహిళ నిలదీసింది. ఇక కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ నగరంలో వన్‌టౌన్‌ పోలీ సు స్టేషన్‌ ఎదురుగా గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వ కుళాయిని మున్సిపల్‌ అధికారులు తొలగించారని, తిరిగి అక్కడే వేయించాలని ఓ మహిళ ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వ కుళాయిలు వేయలేమని, ఇంటింటికి మాత్రమే కనెక్షన్లు ఇవ్వాలని రూల్స్‌ మార్చిందని ఎమ్మెల్యే అన్నారు. ‘ఎన్నిసార్లు రూల్స్‌ మారుస్తారు. మార్చి ప్రజల తలరాతలు మారుస్తున్నారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధిలో కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నాయని, పెన్షన్‌, అమ్మఒడి, విద్యాకానుక రావడం లేదని మరికొందరు చెప్పారు.

Updated Date - 2023-01-29T03:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising