ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జడ్పీటీసీ, వైద్యురాలి మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2023-08-22T00:29:28+05:30

రంగంపేట మండలం పరిషత్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. జడ్పీటీసీ సభ్యుడు, పీహెచ్‌సీ వైద్యురాలు మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. వైద్యురాలి బంధువులు తనపై దాడి చేశారని జడ్పీటీసీ వర్గీయులు ఆరోపించారు.

రంగంపేట, ఆగస్టు 21: రంగంపేట మండలం పరిషత్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. జడ్పీటీసీ సభ్యుడు, పీహెచ్‌సీ వైద్యురాలు మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. వైద్యురాలి బంధువులు తనపై దాడి చేశారని జడ్పీటీసీ వర్గీయులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రంగంపేట మండల సర్వసభ్య సమావేశం సోమవారం మండల పరిషత్‌ అధ్యక్షురాలు రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల ప్రగతి తీరు, సమస్యలపై చర్చ జరిగింది. అయితే కొద్దిసేపు చర్చ అనంతరం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ లావణ్య ఆసుపత్రిలో రోగులు ఉన్నారని, ఓపీ చూడాలని తనకు పర్మిషన్‌ కావాలని ఎంపీడీవో బి.శ్రీరామరాజును కోరగా జడ్పీటీసీ సభ్యులు పేపకాయల రాంబాబు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రగతి గురించి తెలియజేయాలి కదా ఉండండి అని సూచించారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో శిథిలమైన పాత బిల్డింగ్స్‌ కూల్చేస్తున్నారని వాటి వివరాలు కూడా చెప్పాలని అన్నారు. సమావేశం పూర్తయ్యే వరకు ఉండాలన్నారు. అయితే డాక్టర్‌ లావణ్య మీటింగ్‌ జరుగుతుండగా మధ్యలో ఆస్పత్రికి వెళ్లిపోయారు. తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఆమె తండ్రి, అన్నయ్యతో పాటు కొన్ని కార్లు, మోటారుసైకిళ్లు వేసుకొని సుమారు 40 మంది మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలోకి దౌర్జన్యంగా వచ్చి తమపై తిరగబడి.. దుర్భాషలాడారని జడ్పీటీసీ వర్గీయులు చెబుతున్నారు. సర్దిచెబుతున్న కోటపాడు ఎంపీటీసీ సుంకర అప్పారావుపై దౌర్జన్యానికి దిగారని అన్నారు.

Updated Date - 2023-08-22T00:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising