ప్రజా సమస్యలపై దృష్టి : జడ్పీ సీఈవో
ABN, First Publish Date - 2023-06-27T23:59:38+05:30
పెద్దాపురం, జూన్ 27: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జడ్పీ సీసీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అన్నారు. మండలంలోని ఆనూరు గ్రామంలో ఆయన మంగళవా
పెద్దాపురం, జూన్ 27: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జడ్పీ సీఈవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అన్నారు. మండలంలోని ఆనూరు గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించి సచివాలయాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-27T23:59:38+05:30 IST