ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్సార్‌ ఆసరాలో రూ.276.33 కోట్లు జమ

ABN, First Publish Date - 2023-03-26T01:37:09+05:30

స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లిస్తానన్న హామీతో జిల్లాలో ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.829.44 కోట్ల మేర బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్‌ మాఽధవీలత తెలిపారు.

వైఎస్సార్‌ ఆసరాలో చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ మాధవీలత, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బొమ్మూరు, మార్చి 25: స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లిస్తానన్న హామీతో జిల్లాలో ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.829.44 కోట్ల మేర బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్‌ మాఽధవీలత తెలిపారు. శనివారం వర్చువల్‌ విధానంలో వైఎస్సార్‌ ఆసరా మూడో విడతగా ఎస్‌హెచ్‌జీ గ్రూపుల మహిళల ఖాతాల్లో సీఎం జగన్‌ దెందు లూరులో బటన్‌ నొక్కి జమ చేశారు. జిల్లా నుంచి కలెక్టర్‌, అధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ 2021లో 32,313 గ్రూపులకు రూ.274.90 కోట్లు, 2022లో 32,513 గ్రూపులకు రూ.278.22 కోట్లు, 2023లో 32,491 గ్రూపులకు 276.33 కోట్లు జమ చేశామన్నారు. డీసీసీబీ చైర్మన్‌ ఆకుల. వీర్రాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడి కుటుంబ శ్రేయస్సుకు దోహదపడే విధంగా సీఎం ముందుచూపుతో ఆలోచించారన్నారు. మొత్తం మూడు విడతల్లో 78.94 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ. 19,178.17 కోట్లు లబ్ధిని చేకూర్చడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సుభాషిణీ, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising