యువతను నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-04-03T01:08:48+05:30
రాష్ట్రంలో యువతను మోసం చేసి నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు విమర్శించారు.
మామిడికుదురు, ఏప్రిల్ 2: రాష్ట్రంలో యువతను మోసం చేసి నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు విమర్శించారు. మగటపల్లిలో ఆది వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఈమూడన్నరేళ్లలో రూ.17లక్షల కోట్ల పెట్టుబడులను పొరుగు రాష్ట్రాలకు తరిమేసి లక్షలాది మంది యువత ఉపాధికి గండి కొట్టారని విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిచి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండు చేశారు.
Updated Date - 2023-04-03T01:08:48+05:30 IST