ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైనింగ్‌ సీనరేజీ పేరిట.. రౌడీ మమూళ్లు!

ABN, First Publish Date - 2023-08-22T01:22:45+05:30

మైనింగ్‌ సీనరేజి పేరిట వైసీపీ ప్రభుత్వం రౌడీ మామూళ్లు వసూలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనరేజి వసూళ్లను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించింది. వారి నుంచి నెలలో ముందుగానే డబ్బులు తీసుకుని, ఇష్టానుసారం వసూలు చేసుకునే అధికారం వాళ్లకు ధారాదత్తం చేసింది. ఇక ఈ ప్రైవేట్‌ వసూళ్లు దార్లు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. నగదు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిషేధించారు. డూప్లికేట్‌ బిల్లులు ఇస్తున్నారు. ఎంత వసూలు చేస్తున్నారో లెక్క లేకుండా పోయింది. ఇసుక, లిక్కర్‌ మాఫియాను తలపించే విధంగా దోపిడీ చేస్తున్నారు. అన్నిరకాల మైన్స్‌ మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెంచేశారు. ఈ నేపథ్యంలో మైనింగ్‌ లీజుదారులే కాదు.. వినియోగదారులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. క్వారీల్లో కొనుగోలు చేసిన ధరకు అదనంగా ప్రైవేట్‌ చెక్‌పోస్టుల వద్ద సీనరేజ్‌ పేరిట డబ్బు చెల్లించవలసి వస్తోంది.

దేవరపల్లిలో క్రషర్‌

మైనింగ్‌ సీనరేజి పేరిట వైసీపీ ప్రభుత్వం రౌడీ మామూళ్లు వసూలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనరేజి వసూళ్లను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించింది. వారి నుంచి నెలలో ముందుగానే డబ్బులు తీసుకుని, ఇష్టానుసారం వసూలు చేసుకునే అధికారం వాళ్లకు ధారాదత్తం చేసింది. ఇక ఈ ప్రైవేట్‌ వసూళ్లు దార్లు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. నగదు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిషేధించారు. డూప్లికేట్‌ బిల్లులు ఇస్తున్నారు. ఎంత వసూలు చేస్తున్నారో లెక్క లేకుండా పోయింది. ఇసుక, లిక్కర్‌ మాఫియాను తలపించే విధంగా దోపిడీ చేస్తున్నారు. అన్నిరకాల మైన్స్‌ మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెంచేశారు. ఈ నేపథ్యంలో మైనింగ్‌ లీజుదారులే కాదు.. వినియోగదారులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. క్వారీల్లో కొనుగోలు చేసిన ధరకు అదనంగా ప్రైవేట్‌ చెక్‌పోస్టుల వద్ద సీనరేజ్‌ పేరిట డబ్బు చెల్లించవలసి వస్తోంది.

ప్రైవేట్‌ వ్యక్తులతో సీనరేజి వసూళ్లు

నగదే... ఆన్‌లైన్‌ లావాదేవీలు నిషేధం

ఉమ్మడి తూర్పుగోదావరిలో సీనరేజ్‌ ఏడాదికి రూ.120 కోట్లకు కాంట్రాక్టు

ఊరూవాడా చెక్‌పోస్టులు

మట్టిని కూడా వదలని వసూలుదారులు

వినియోగదారులపై విపరీత భారం

క్వారీ యజమాని తన ఇంటింటికి తోలాలన్నా డబ్బు కట్టవలసిందే

కొనుగోలు చేసిన సరుకుకు అదనంగా సీనరేజ్‌ వసూళ్లు

ఇసుక, లేటరైట్‌కు సీనరేజీ మినహాయింపు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

అసలు మైనింగ్‌ విధానం ప్రకారం డెడ్‌ రెంట్‌, సీనరేజి వసూలు చేస్తుంటారు. ఒక క్వారీ తవ్వుకోడానికి అనుమతి తీసుకున్నప్పుడు అది ప్రభుత్వ క్వారీ అయినా, ప్రైవేట్‌ క్వారీ అయినా హెక్టార్‌కు ఏడాదికి కొంత సొమ్ము చెల్లించవలసి ఉంది. ఇంటికి, రోడ్లకు ఉపయోగించే మెటల్‌ (నల్లకంకర) క్వారీ హెక్టార్‌కు ఏడాదికి రూ.65 వేలు డెడ్‌ రెంట్‌ చెల్లించాలి. గ్రావెల్‌కు రూ.52 వేలు చెల్లించాలి. గ్రానైట్‌కు రూ.లక్షా 20 వేలు, క్వార్ట్జ్‌, లేటరైట్‌కు రూ.20 వేలు చెల్లించాలి. అది కాకుండా క్వారీ నుంచి మెటీరియల్‌ తవ్వినందుకు మెటల్‌ క్యూబిక్‌ మీటర్‌కు రూ.90, గ్రావె ల్‌కు రూ.45, మట్టికి రూ.45 చెల్లించాలి. గ్రానైట్‌ క్యూబిక్‌ మీటరుకు రకాన్ని బట్టి రూ.2750 నుంచి రూ.3500 వరకూ ఉంది. లేటరైట్‌కు టన్నుకు రూ.150, క్వార్ట్జ్‌కు టన్నుకు రూ.90 చెల్లిం చాలి. ఇసుక క్యూబిక్‌ మీటరుకు రూ.100 ఇవ్వాలి. ఇలా గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.130 కోట్లు ప్రభుత్వ మైనింగ్‌ శాఖ ద్వారా వసూలుచేశారు. అదికాకుండా ఓఎన్జీసీ ద్వారా రూ.350 కోట్లు వచ్చింది. ఇది ప్రభుత్వం అధికారికంగా మైనింగ్‌ అధికార్ల ద్వారా వసూ లు చేసే విఽధానం. ఇవాళ ప్రభుత్వం దోపిడీకి తెరదీసినట్టు అర్థమవుతోంది. ఇసుక ర్యాంపులను గుత్తగా ఇచ్చేసి, ముందే డబ్బులు కట్టించుకుంటున్నట్టు మైనింగ్‌ సీనరేజిని కూడా ముందే లాగేయడానికి ప్లాన్‌చేసి ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గనుల నుంచి సీనరేజ్‌ వసూలు చేయడానికి ఓ సంస్థకు ఏడాదికి రూ.120 కోట్లకు ఇచ్చేసింది. ఈ ఒప్పందం ప్రకారం సదరు సంస్థ ముందుగా రూ.10 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. అక్కడి నుంచి ప్రతీ నెలా ముందుగా రూ.10 కోట్లు ఇచ్చేసి తన ఇష్టానుసారం సీనరేజ్‌ వసూలు చేసు కోవచ్చు. ఈ విఽధానంతో కొద్దినెలలుగా జిల్లా అంతటా ప్రైవేట్‌ సంస్థ ప్రతీ క్వారీ నుంచి లారీ లు వచ్చేచోట, రోడ్ల మీద, చెరువులలో మట్టి తీసేచోట, గ్రావెల్‌ తవ్వేచోట, కొండలు, క్వారీల నుంచి లారీలు బయటకు, సిటీలోకి, గ్రామాలలోకి లారీలు, ట్రాక్టర్లు ప్రవేశించే చోట్ల ప్రైవేట్‌ చెక్‌పోస్టులు వెలిశాయి. వీటికి మైనింగ్‌ చెక్‌పోస్టులని పేరు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో 50కు పైగా మైనింగ్‌ చెక్‌పోస్టులు ఉంటాయి. ఇవి కాకుండా మొబైల్‌ స్క్వాడ్‌ కూడా ఏర్పాటు చేశా రు. పెద్ద చెక్‌పోస్టుల వద్ద సుమారు 10 మంది ఉద్యోగులను పెట్టారు. చిన్నవాటి వద్ద ఇద్దరు నుంచి నలుగురి వరకూ పెట్టారు. వీరంతా 24 గంటలు డ్యూటీ చేయాలి. మెటీరియల్‌తో ఏ లారీ వచ్చినా, ట్రాక్టర్‌ వచ్చినా, ఏ వాహనం వచ్చినా ఇక్కడ ఆపుతారు. సీనరేజ్‌ కట్టించుకుని బిల్లు ఇస్తారు. కానీ అవి డూప్లికేట్‌ బిల్లులు. ఈ చెక్‌పోస్టుల వద్ద సీనరేజ్‌కు ధరలు నిర్ణయిం చారు. మెటల్‌ యూనిట్‌కు రూ.630 కట్టాలి. అంటే 500 కేజీలు ఒక క్యూబిక్‌ మీటర్‌. క్యూబిక్‌ మీటరుకు రూ.210. మూడు క్యూబిక్‌ మీటర్లు ఒక యూనిట్‌. అందువల్ల రూ.630 కట్టించు కుంటారు. గ్రావెల్‌, ఎర్రమట్టి యూనిట్‌కు రూ.315, చట్రు యూనిట్‌కు రూ.315 ఇలా క్వారీ బూడిదనూ వదలడంలేదు. సీనరేజ్‌ ప్రైవేట్‌ వసూళ్లతో భవన, రోడ్డు నిర్మాణ, ఫిల్లింగ్‌ మెటీరి యల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు, ఇంటి నిర్మాణ మెటల్‌ యూనిట్‌ ధర క్రషర్‌ వద్ద రూ.2,200. రెండు యూనిట్లకు రూ.4,400, ఆరు యూనిట్లకు 13,200 అయ్యేది. ప్రైవేట్‌ వ్యక్తులు సీనరేజి వసూళ్లు చేయకముందు ఆరు యూనిట్ల మెటల్‌ కావాలంటే రూ. 13,200కు అదనంగా లారీ రవాణాచార్జీ ఉండేది.

కిలోమీటరుకు రూ.120 వసూలు చేసేవారు. 50కిలోమీటర్ల దూరంలో ఉన్న వినియోగదారుడికి 6 యూనిట్ల మెటల్‌ (నల్లకంకర) రవాణా చేయాలంటే మెటల్‌ ఖరీదు, 13,200, లారీ రవాణాచార్జీ 6 వేలు కలిపి మొత్తం 19,200 అయ్యేది. ఇవాళ అదే మెటల్‌, అదే దూరం రావాలంటే అదనంగా మరో రూ.3,780 కట్టించు కుంటారు. యూనిట్‌కు రూ.630 వంతున 6యూనిట్లకు రూ.3,780 అవుతుంది. దీనితో కలు పుకుని 6 యూనిట్ల మెటల్‌ ఖరీదు రూ.22,980 అవుతుంది. గతంలో ఈ సీనరేజి వినియోగ దారుడికి ఉండేది కాదు. ముందుగానే క్వారీ యజమాని చెల్లించేవాడు. క్రషర్‌లో ఎంత ధర ఉంటే అంత ధరకే వినియోగదారుడు కొనుకునేవాడు. దూరాన్ని బట్టి ట్రాన్స్‌ఫోర్ట్‌ చార్జీ ఉం డేది. ఇవాళ వినియోగదారుడు అదనంగా భరించవలసి వస్తోంది. పైగా ఇది బిల్లు డూప్లికేట్‌ బిల్లు. జీఎస్‌టీ బిల్లు ఇస్తే మరికొంత చెల్లించాలి. రోడ్డు, ఇంటి మెటీరీయల్‌కు సంబంధించిన మెటల్‌కు రూ.18 శాతం కట్టాలి. ముడిసరుకు అయితే 5 శాతం కట్టాలి. అదనపు జీఎస్‌టీ రూ.700 వరకూ కట్టించుకుంటారు. వినియోగదారుడికి జీఎస్‌టీ ఉన్న బిల్లులు ఇవ్వడంలేదు. ఇసుక, లేట్‌రైట్‌కు సీనరేజి వసూలు బాధ్యత ప్రైవేట్‌కు అప్పగించలేదు. ఇసుకకు క్యూబిక్‌ మీటరుకు రూ.100 వరకూ కట్టాలి. నగదు రూపేణా వసూళ్లు చేస్తూ వైసీపీ పెద్దలే ఈ వ్యా పారం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక లేటరైట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలకు వెళుతుంది. ఇందులో కూడా పెద్దల హస్తం ఉండడంతో దీని జోలికి కూడా ఎవరూ వెళ్లడంలేదు.

ఆన్‌లైన్‌ బిల్లు ఎందుకు ఇవ్వడంలేదు?

ఈ సీనరేజి వసూళ్లలో ఆన్‌లైన్‌ బిల్లు ఇవ్వడంలేదు. ఒరిజినల్‌ బిల్లు ఇవ్వడంలేదు. అంతే ఎంత కుంభకోణం జరుగుతుందో, ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్‌ బిల్లు ఇవ్వకపోవడం వల్ల లారీ ట్రాన్స్‌పోర్టర్లు కూడా దెబ్బతింటున్నారు. సాధారణంగా మెట ల్‌కు 18 శాతం, ముడిసరుకు 5 శాతం వంతున జీఎస్‌టీని కాంట్రాక్టర్లే కట్టేస్తారు. ఏదైనా భవన నిర్మాణంకానీ, రియల్‌ ఎస్టేట్‌కానీ, రోడ్డు, వంతెనల నిర్మాణ కాంట్రాక్టర్లు అయినా సరే వారే కట్టేస్తారు. బయట జీఎస్‌టీ బిల్లులతో వసూలు చేస్తే వీటిని తిరిగి ప్రభుత్వం నుంచి డబ్బును క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ప్రైవేట్‌ మైనింగ్‌ సీనరేజి వసూ లుదారులు డూప్లికేట్‌ బిల్లులు ఇవ్వడం వల్ల జీఎస్‌టీని క్లెయిమ్‌ చేసుకునే అవకాశం లేదు. అందుకే ఇక్కడ డూప్లికేట్‌ బిల్లులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొవ్వూరు వైపు నుంచి వచ్చే లారీల వద్ద సీనరేజి వసూళ్లు చేయడానికి ఫోర్తు బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుమీద పెద్ద చెక్‌పోస్టు పెట్టారు. జిల్లాలో సుమారు 50కు పైగా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి దోచేస్తున్నారు.

రూ.కోట్లలో దోపిడీ

మైనింగ్‌ అంటేనే పెద్ద దోపిడీ. దీనిని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అతితెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత ఏడాది మైనింగ్‌ ద్వారా రూ.130 కోట్ల సీజరేజి వసూలైంది. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థకు రూ.120 కోట్లకే కట్టబెట్టింది. వాస్తవానికి ఇక్కడ రూ. వందల కోట్ల వసూలు అవుతున్నట్టు చెబుతున్నారు. గతంలో మైనింగ్‌లో అధికారులు పూర్తి స్థాయిలో సీనరేజి వసూలు చేసేవారు కాదు. ఒక లారీకి ఇచ్చిన బిల్లును ఉపయోగించి నాలుగైదు లారీలు బయటకు వెళ్లిపోయేవి. మైనింగ్‌ అధికార్లకు, ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు కొంత ముట్టజెప్పి, క్వారీ యజమానులు అధికలాభాలు సంపాదించేవారు. అలా చేసినా గత ఏడాది రూ.130 కోట్లు సీనరేజి ఆదాయం వచ్చిందంటే, అప్పటి ధరలతోనే వసూలు మొత్తం అన్ని లారీలకు వసూలు చేసినా సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ అన్ని రకాల బళ్లకు వసూళ్లు చేయడంతోపాటు జనం నుంచి అదనంగా వేలకువేలు నేరుగా వసూళ్లు చేయడంతో ఈ ఆదాయం మరిన్ని కోట్ల రూపాయలను తెచ్చిపెడుతోంది. చివరకు సొంత క్రషర్‌ యజమాని కూడా తన ఇంటికో, కావలసిన వారికో ఉచితంగా ఇవ్వలేని పరిస్థితి. ఆయన ఉచితంగా ఇచ్చినా, సీనరేజి వేలాది రూపాయలు కట్టవలసిందే. సొంతానికి పట్టు కెళ్లినా కట్టవలసిందే. అటు గ్రావెల్‌ ధరలూ అంతే. గతంలో నేతలు తెగతవ్వేసుకునేవారు. ఇవాళా తవ్వుకుంటున్నారు. కానీ వారు అమ్మే ధరకు అదనంగా సీనరేజ్‌ కట్టవలసి వస్తోంది. ఈ భారం అంతా వినియోగదారుడి మీదే పడుతోంది.

Updated Date - 2023-08-22T01:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising