వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
ABN, First Publish Date - 2023-10-05T01:17:51+05:30
రాష్ట్రంలో జగన్‌రెడ్డి చేస్తున్న కక్ష పూరిత రాజకీయా లకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
కొనసాగుతున్న టీడీపీ నిరసన దీక్షలు
అనపర్తి, అక్టోబరు 4 : రాష్ట్రంలో జగన్‌రెడ్డి చేస్తున్న కక్ష పూరిత రాజకీయా లకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు అక్రమ అరెస్టును నిరశిస్తూ బుధవారం రాత్రి అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, తెలుగు మహిళలు గ్రామంలోని ప్రధాన వీధులగుండా నిరశన ప్రదర్శన నిర్వహించి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం 270 కోట్ల అవినీతి ఆరోపణలకే చంద్రబాబును నెలరోజులుగా రిమాం డ్‌లో ఉంచారని 43వేల కోట్ల అవినీతి రుజువైన జగన్‌రెడ్డిని ఈ లెక్కన 11 సంవత్సరాలపాటు జైలులో ఉంచాలని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీపై కక్ష సాధించడం అక్రమ కేసులు పెట్టడం మినహా సాధించింది ఏమీలేదన్నారు. గురువారం తిరిగి ఢిల్లీ వెళుతున్న జగన్‌రెడ్డి మరిన్ని కుట్రలకు పెద్దల సలహాలు తీసుకోవడానికేనని అన్నారు. జగన్‌రెడ్డి జైలుకు వెళ్లినపుడు ప్రజలు స్పందించలేదని ఇపుడు బాబును అక్రమంగా జైలుకు పంపితే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరశనలు తెలుపుతున్నారని అదే బాబు నిజాయితీకి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమ ంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి ఈశ్వరరెడ్డి, తెలుగు మహిళలు కర్రి శేషారత్నం, పోతంశెట్టి సుభాషిణి, ఒంటిమి గౌతమి, సిరసపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీ
బిక్కవోలు: టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలతో కలసి ఆరికరేవుల గ్రామంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఇంటింటా పర్యటించి చంద్రబ.ాబును రాజకీయ కక్షలతో అరెస్టు చేశారంటూ మహిళా నేతలతో కలసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఏవిధమైన ఆధారాలు లేక పోయినప్పటికీ అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని ప్రజలకు వివరించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ 9261292612కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని కోరారు. ఈయన వెంట దేశం నేతలు జుత్తుగ సూర్యకుమారి, బేరా వేణమ్మ, కర్రి శేషారత్నం, రెడ్డి నాగవేణికుమారి, ఽసిరసపల్లి లక్ష్మి, తొండాపు వీర్రాఘవరెడ్డి, రెడ్డి శ్రీను, వినాయకరావు, ప్రగడారావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
బొడ్డు వెంకటరమణ చౌదరి
కోరుకొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బుధవారం కోరుకొండ మండలం నిడిగట్లలో రైతులు, మహిళలు చేపట్టిన నిరసన రిలే నిరాహార దీక్షల్లో టీడీపీ ఇన్ చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా ప్రజల మధ్యకు వస్తారని ప్రజాభిమానంతో టీడీపీ ఘన విజయంసాధిస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. ఈ నాటి దీక్షల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తనకాల నాగేశ్వరరావు, మండల కన్వీనర్ మింగి లక్ష్మినారాయణ, రైతు నాయకుడు కంటే నాగకేశవరావు, బాబురావునాయుడు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
పోలీసులు అడ్డగించినా ఆగని నిరసన
సీతానగరం: పోలీసులు అడ్డగించినా టీడీపీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. బుధవారం చినకొండేపూడి గ్రామం నుంచి చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మహిళలు నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతానగరం ఎస్‌ఐ చిరంజీవి అక్కడకు చేరుకుని ర్యాలీకి అభ్యంతరం తెలుపుతూ 144వ సెక్షన్ అమలులో ఉందని ర్యాలీకి అనుమతి లేదని ర్యాలీ నిలిపివేయాలని చెప్పడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ మా నాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేయడంతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం.. నిరసన కార్యక్రమాలకు అడ్డుపడడం సరికాదంటూ పోలీసు హెచ్చరికలను తోసిరాజని చినకొండేపూడి నుంచి సీతానగరం బస్‌స్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు
నిడదవోలు, అక్టోబర్ 4 : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో బుధవారం నిడదవోలులో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబు అరెస్ట్‌ను చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మన వెంకటేశ్వరరావు, నిడదవోలు మండల టీడీపీ అఽధ్యక్షుడు వెలగన సూర్యారావు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
కుందుల ఆధ్వర్యంలో నిరాహారదీక్ష
టీడీపీ నియోజకవర్గ నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నిడదవోలులో 22వ రోజు రిలే నిరాహారదీక్ష చేశారు. కుందుల సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయకక్షతో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మహిళల నిరసన
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో బుధవారం తెలుగుదేశం, జనసేనపార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహిళలు స్వచ్ఛందంగా దీక్ష పూనారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహంవద్ద బాబుతో మేము సైతం అంటూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. పలువురు మహిళలు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిందని, దీనికి రానున్న ఎన్నికల్లో మహిళలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తుంపల్లి సింహాచలం, బేతిన కాశీ అన్నపూర్ణ భవాని, వేములపల్లి అనూరాధ, తాళ్ళూరి అపర్ణ, గారపాటి పద్మావతి, పద్మజ, ఈడ్పుగంటి శ్రీదేవి, చుండ్రు దుర్గాదేవి, కిలారి సత్యవతి, అధికసంఖ్యలో మహిళలు చంద్రబాబుకు మద్దతుగా దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేగి చిన్నా, గారపాటి రామచంద్రరావు, బేతిన నారాయణ, గారపాటి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ఆలపాటి సాయికృష్ణ, ఎంపీటీసీ కె.బాలకృష్ణ, జనసేన నాయకులు రకమండ రమేష్ పాల్గొన్నారు.
పెద్దేవంలో టీడీపీ రిలే నిరాహార దీక్షలు
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం గ్రామంలోని సినిమాహాల్ సెంట రు లో బాబుకు సైతం మేముతోడుగా అంటూ టీడీపీ, జనసేన పార్టీలు రిలే నిరా హారదీక్షలు చేట్టారు. చంద్రబాబుపై పెట్టిన కేసు ముమ్మాటికీ అక్రమ చర్యేనని బాబు బయటకు వచ్చేవరకూ తమ నిరసన ఇలాగే కొనసాగిస్తామని పలువు రు నాయకులు తమ ప్రసంగాలలో తెలిపారు. పెద్దేవం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కోడి శంకరం, తిగిరిపల్లి గోపి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో కొవ్వూరు టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన ్నలగడ్డ సుబ్బరాయ చౌదరి మాట్లాడుతూ నారా భువనేశ్వరి సైతం టీడీపీ అన్ని వర్గాలవారు న్యాయంకోసం పోరాటం చేస్తున్నామని ప్రజలంతా జగన్ అరాచక పాలనను గమనిస్తున్నారని తెలిపారు. కంఠమణి రామకృష్ణ మాట్లాడుతూ న్యాయపో రాటం చేస్తున్న టీడీపీ, జనసేన కార్యకర్తపై జగన్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు సరి కావన్నారు. కార్యక్రమంలో తాళ్లపూడి మండల టీడీపీ అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు, తెలుగు యువత నామా సురేంద్ర, కోఠారు వెంకట్రా వు, బోడపాటి కాశీ, గంగరాజు, ఆత్కూరి రాంబాబు, కైగాల శీనివాస్, సిద్దా దుర్గారావు, మాజీ ఎమ్మెల్యే, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామారావు, జనసేన నాయకులు గాయత్రీ వెంకటేశ్వరరావు, తోరలపాటి సీతల్, నామన చిన బూరయ్య, కడలి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
దేవరపల్లి: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. దేవరపల్లిలో ముప్పిడి ఇంటి వద్ద బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రజలు తమ హక్కులకోసం న్యాయం కోసం నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి జైళ్లో నిర్భందించటం దుర్మార్గమన్నారు. టీడీపీ పార్టీ మిత్రపక్షాలైన జనసేన, సీపీఎం, దళిత సం ఘాలపైన కక్షసాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయు డు సతీమణి నారా భువనేశ్వరి న్యాయపోరాటం చేస్తుంటే సంఘీభావం తెలి యజేయడానికి అమరావతి రైతులను అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు రాజకీయపార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భువనేశ్వరిపైన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వి.అనీత, మాజీ మంత్రి పీతల సుజాతపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాకి అప్పుడు మహిళలు గుర్తురాలేదా, ఇప్పుడు మహిళ అని చూడకుండా నన్ను సోషల్ మీడియాలో విమర్శించారని కన్నీరుకార్చటం ఎంత వరకు సమంజసం అన్నారు. కార్యక్రమంలో ముప్పిడి అశోక్‌కుమార్, బొల్లిన బాబి, మల్లెల వెంకటేశ్వరరావు, కే.రవికుమార్, పసలపూడి దేవ పాల్గొన్నారు.
భువనేశ్వరిని కలిసిన ఇమ్మని రాజేశ్వరి
దేవరపల్లి, అక్టోబరు 4: చంద్రబాబునాయుడు సతీ మణి నారా భువనేశ్వరిని రాజమహేంద్రవరంలో మాజీ జడ్పీచైర్మన్ ఇమ్మని రాజేశ్వరి, మాజీ తెలుగు దేశంపార్టీ తెలుగు యువ త అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీనివాస్‌చౌదరి భువ నేశ్వ రిని కలిసి సంఘీభావం తెలిపారు. ఇమ్మని రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నారాచంద్రబాబుపై కుట్రలుపన్ని అక్రమకేసులు బనా యించారని విమర్శించారు. గ్రామాల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు పెద్దఎ త్తున మహిళలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మహిళ ఆధ్వర్యం లో బస్సుయాత్ర కూడా చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలవద్దకు మహిళలు సమిష్టిగా వెళ్లి సంఘీభావం తెలుపు తామన్నారు.
Updated Date - 2023-10-05T01:17:51+05:30 IST