ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు చెల్లిస్తారా? మమ్మల్ని చెల్లించమంటారా?

ABN, First Publish Date - 2023-06-07T00:46:25+05:30

ధాన్యం కొనుగోలులో రైతుల నుంచి అన్యాయంగా వసూలు చేసిన సొమ్ములను మీరు చెల్లిస్తారా లేకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చెల్లించమంటారా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రైతు స్టీరింగ్‌ కమిటీ సమావేశమై రైతు సమస్యలపై చర్చించారు.

స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో రైతు సమస్యలపై చర్చిస్తున్న రామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు నష్టాలు

  • తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

  • మంగళగిరిలో టీడీపీ రైతు స్టీరింగ్‌ కమిటీ సమావేశం

అనపర్తి, జూన్‌ 6: ధాన్యం కొనుగోలులో రైతుల నుంచి అన్యాయంగా వసూలు చేసిన సొమ్ములను మీరు చెల్లిస్తారా లేకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చెల్లించమంటారా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రైతు స్టీరింగ్‌ కమిటీ సమావేశమై రైతు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైందని, ముఖ్యంగా కౌలు రైతులు వ్యవసాయానికి దూరమ వుతూ వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధించిన నిబంధనల వల్ల రైతులు విపరీతంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు తుఫాను బారిన పడ్డారని, రబీలో రైతులు వర్షాల వల్ల తీవ్రం నష్టం బారిన పడినా వారిని పలకరించే నాథుడే లేకుండా పోయాడని అన్నారు. నష్టపోయిన రైతుల పక్షాన చంద్రబాబు నిలిచారని ఆయన పర్యట నతోనే యంత్రాంగం కదిలిందని అన్నారు. రైతు గెలవాలి వ్యవసాయం నిల వాలి అన్న నినాదంతోనే రైతు సమస్యలపై కమిటీ చర్చించిందన్నారు. సమావే శంలో రైతు స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్ర మోహనరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పాల్గొన్నారు.

  • చెరువు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

బిక్కవోలు మండలం కాపవరంలోని వెదుళల చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం రాజమహేంద్రవరం లోని గనులు, భూగర్భ శాఖ ఏడీకి ఫిర్యాదు చేసినట్టు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. వెదుళ్ల చెరువు తవ్వకాలపై ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు ఉన్నాయని, ఇద్దరు రైతులకు అనుమతులు ఇచ్చారని, వారి వ్యవసాయ భూమిలో పదిశాతం మాత్రమే మట్టిని తరలించి 90శాతం మట్టిని అక్రమంగా తరలించారని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని ఏడీని కోరినట్టు రామకృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-07T00:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising