ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మర్మావయవాలపై దాడి చేసి భర్త హత్య

ABN, First Publish Date - 2023-06-11T01:03:11+05:30

బాధ్యత మరిచి తప్పతాగి తిరుగుతున్న ఓ వ్యక్తిని సహనం కోల్పోయిన అతని భార్య మర్మావయవాలపై తన్ని హతమార్చింది. కాకినాడలోని అవసరాల వారి వీధికి చెందిన తాడి శ్రీనివాసరావు (32)కు లలితతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం: జూన్‌ 10: బాధ్యత మరిచి తప్పతాగి తిరుగుతున్న ఓ వ్యక్తిని సహనం కోల్పోయిన అతని భార్య మర్మావయవాలపై తన్ని హతమార్చింది. కాకినాడలోని అవసరాల వారి వీధికి చెందిన తాడి శ్రీనివాసరావు (32)కు లలితతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శ్రీనివాసరావు ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో రాయప్ప లాడ్జిలో పనిచేసేవాడు. అయితే అతను గత కొన్ని రోజులుగా పనికి వెళ్లడం మానేసి మద్యానికి బానిసై తప్పతాగి తిరుగుతున్నాడు. అయినా సరే లలిత సహనంతో తనలోతానే బాధను దిగమింగుతూ సర్దుకుపోతోంది. కానీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. లలిత తన తల్లి, సోదరుడి సహకారంతో ఇల్లు నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో వారు అద్దెకుంటున్న ఇంటిని ఆ యజమాని ఖాళీ చెయ్యమనడంతో ఆమె తన సోదరునితో కలిసి అద్దె ఇంటి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలో శనివారం తన సోదరుడితో వెళ్లిన లలిత మధ్యాహ్నానానికి మంచి ఎండలో ఇంటికి చేరుకుంది. తలుపు తీసి చూసే సరికి శ్రీనివాసరావు మద్యం మత్తులో గదికి అడ్డంగా పడుకుని ఉన్నాడు. మండుటెండలో వచ్చిన లలితకు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆమె తన భర్తను మర్మాంగంపై తన్నింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా అతని బావని కొట్టి బయటకు గెంటేసాడు. దాంతో శ్రీనివాసరావు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి చెట్టు కింద పడిపోయాడు. స్థానికులు మర్మావయవం దగ్గర తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న శ్రీనివాసరావును జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-06-11T01:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising