ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారాహి యాత్ర షెడ్యూల్‌ ఖరారు

ABN, First Publish Date - 2023-06-11T01:14:27+05:30

జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తన వారాహి వాహనంపై నియోజకవర్గాల్లో చేపట్టే యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. కాకినాడ జిల్లాలో ప్రారంభమై కోనసీమ మీదుగా పశ్చిమగోదావరిజిల్లాలో యాత్ర జరగనున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

13న రాత్రి అన్నవరం చేరుకోనున్న పవన్‌కల్యాణ్‌

14న కత్తిపూడి, 16న పిఠాపురం, 18న సర్పవరంలో బహిరంగసభలు

పిఠాపురం, జూన్‌ 10: జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తన వారాహి వాహనంపై నియోజకవర్గాల్లో చేపట్టే యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. కాకినాడ జిల్లాలో ప్రారంభమై కోనసీమ మీదుగా పశ్చిమగోదావరిజిల్లాలో యాత్ర జరగనున్నది. రాష్ట్రంలో ప్రథమంగా వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచే ప్రారంభించనున్న నేపథ్యంలో జనసేన నాయకులు, జనసైనికులు, అభిమానులు దీనిని విజయవంతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల నాయకులతో చర్చించి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పవన్‌కల్యాణ్‌ పర్యటన ఉండే తీరుని వివరిస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ సతీ్‌షకుమార్‌కు జనసేన నాయకులు లేఖను అందజేశారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళగిరి నుంచి 13వ తేదీ రాత్రికి అన్నవరం చేరుకోనున్నారు. రాత్రికి అన్నవరం కొండపైగల సప్తగిరి గెస్ట్‌హౌ్‌స్‌లో బసచేయనున్నారు. ఉదయం 9గంటలకు సత్యదేవుడిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు వారాహి యాత్రను ప్రారంభించి 5గంటలకు కత్తిపూడి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం వారాహి వాహనంపై చేబ్రోలు, గొల్లప్రోలు మీదుగా పట్టణ శివారులోని ఫంక్షన్‌హాలుకు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.

15వ తేదీ ఉదయం 9 గంటలకు విద్యావేత్తలు, ప్రముఖులు, వృత్తినిపుణులు, ఎన్‌జీవో ప్రతినిధులతో సమావేశమవుతారు. 10గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలు, ఇబ్బందులపై ప్రజలు నుంచి వినతులు స్వీకరిస్తారు. 11 గంటలకు వీరమహిళా విభాగం సమావేశం, మధ్యాహ్నం 12గంటలకు మీడియా సమావేశం ఉంటాయి.

16వ తేదీ ఉదయం 9గంటలకు స్థానిక నాయకులతో సమావేశం, 10గంటలకు కార్మిక, చేతివృత్తులు, రైతులతో సమావేశం, 11గంటలకు ఫీల్డ్‌ విజిట్‌ ఉంటుంది. సాయంత్రం గొల్లప్రోలు నుంచి పిఠాపురం ఉప్పాడ సెంటర్‌కు చేరుకుని 5గంటలకు జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌వద్ద గల క్లబ్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు.

17వ తేదీ ఉదయం 9గంటలకు కాకినాడ అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన విద్యావేత్తలు, ప్రముఖులు, వృత్తి నిపుణులు, ఎన్‌జీవో ప్రతినిధులతో సమావేశమవుతారు. 10 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలు, ఇబ్బందులపై ప్రజలు నుంచి వినతులు స్వీకరిస్తారు. 11 గంటలకు వీరమహిళా విభాగం సమావేశం, మధ్యాహ్నం 12గంటలకు మీడియా సమావేశం ఉంటాయి.

18వ తేదీ ఉదయం 9గంటలకు స్థానిక నాయకులతో సమావేశం, 10గంటలకు కార్మిక, చేతివృత్తులు, రైతులతో సమావేశం, 11గంటలకు కాకినాడ రూరల్‌లో ఫీల్డ్‌ విజిట్‌ ఉంటుంది. సర్పవరం సెంటర్‌లో సాయంత్రం 5గంటలకు జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు.

19వ తేదీ ఉదయం 9గంటలకు స్థానిక నాయకులతో సమావేశం, మధ్యాహ్నం 12గంటలకు కాకినాడ అర్బన్‌ పరిధిలో ఫీల్డ్‌ విజిట్‌, మధ్యాహ్నం ఒంటి గంటకు యానాం మీదుగా ముమ్మిడివరం నియోజకవర్గానికి వెళతారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులకు మరిన్ని సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు.

Updated Date - 2023-06-11T01:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising