గుర్తింపు కలిగిన పాఠశాలల్లోనే చేర్పించాలి
ABN, First Publish Date - 2023-06-11T00:36:43+05:30
కాకినాడ సిటీ, జూన్ 10: విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున గుర్తింపు కలిగిన ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఐక్య ఫ్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య (యూపీఇఐఎఫ్) రాష్ట్ర న్యాయ సలహాదారుడు మతుకుమిల్లి శ్రీవిజయ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ అశోక్‌నగర్‌లోని ఎంఎ్‌సఎన్ విద్యాసంస్థలో సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పిల్లల బదిలీ ధ్రువపత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నం
యూపీఇఐఎఫ్ న్యాయ సలహాదారుడు
కాకినాడ సిటీ, జూన్ 10: విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున గుర్తింపు కలిగిన ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఐక్య ఫ్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య (యూపీఇఐఎఫ్) రాష్ట్ర న్యాయ సలహాదారుడు మతుకుమిల్లి శ్రీవిజయ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ అశోక్‌నగర్‌లోని ఎంఎ్‌సఎన్ విద్యాసంస్థలో సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పిల్లల బదిలీ ధ్రువపత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నందున తల్లిదండ్రు లు గుర్తింపుపొందిన ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించాలని, వేరే పాఠశాలకు మారే సమయంలో బదిలీ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా తీ సుకోవాలని సూచించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నిర్ణయించుకునే అఽధికారం ఆయా పాఠశాలల పాలకవర్గసభ్యులకు మాత్రమే ఉంటుందని గమనించాలన్నారు. విద్యాశాఖకు పాఠ్యాంశాలను రూపకల్పన చేసే అధికారం ఉంటుంది కానీ పాఠ్య పుస్తకాలను విక్రయించే అధికారం ఉండదన్నారు. ఈ విషయంలో పాఠశాలలపై తీవ్ర ఒత్తిడికి గురి చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలన్నారు. విద్యార్థుల బదిలీ ధ్రువపత్రాలను పాఠశాలల్లో ఇవ్వకుండా ఎప్పుడూ ఆపరని, ఫీజు బకాయి ఉంటే యాభై శాతం చెల్లించి మిగిలిన మొత్తం ఎప్పుడు చెల్లించేది అంగీకార పత్రం రాసి తీసుకెళ్లమని మాత్రమే చెబుతారన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి ప్రైవేటు విద్యాసంస్థలు రావ నే విషయాన్ని అధికారులు, అర్జీదారులు గమనించాలని శ్రీవిజయ్ కోరారు. ఈ సమావేశం లో పాఠశాలల కరస్పాండెంట్‌లు సురేష్, నారాయణ, ఫెడరేషన్ ప్రతినిధులు ఇదయతుల్లా, షబ్బీర్, ప్రకాష్, సుజ్ఞాన్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2023-06-11T00:36:43+05:30 IST