ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంబేడ్కర్‌ ఆశయాలతో సేవ చేస్తా

ABN, First Publish Date - 2023-07-13T23:59:34+05:30

తుని, జూలై 13: అంబేడ్కర్‌ ఆశయాలతో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో నాన్న, చిన్నానల స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తానని, ప్ర జలంతా ఆశీర్వదించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో తుని 3వ వార్డులో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో దివ్యకు హారతులు పట్టారు. కృష్ణుడు మాట్లాడతూ దళితులు ఆర్థికంగా బలపడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య

తుని, జూలై 13: అంబేడ్కర్‌ ఆశయాలతో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో నాన్న, చిన్నానల స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తానని, ప్ర జలంతా ఆశీర్వదించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో తుని 3వ వార్డులో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో దివ్యకు హారతులు పట్టారు. కృష్ణుడు మాట్లాడతూ దళితులు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అనేక పథకాలు అమలుచేశారని వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేశారన్నారు. ఎన్నికల ముందు పేద, మధ్య తరగతి ప్రజలను అమలుకానీ హామీలతో మోసగించిన జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సి ద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందన్నారు. నిత్యావసర సరుకులుతో పాటు పెట్రోలు, డీజల్‌ ధరలు కూడా భా రీగా పెంచేశారన్నారు. పేదలకు పథకాల పేరు తో అరకొర ఇచ్చిన డబ్బును ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం లాగేస్తుందన్నారు. తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌ మాట్లాడుతూ వచ్చేది రామరాజ్యమనేనని ప్రజలు అధైర్య పడకుండా కొద్దిరోజులు ఓపిక పట్టాలన్నారు. పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యం తో మొదటి విడతగా చంద్రబాబు అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. అనంతరం మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్‌, సుర్ల లోవరాజు, లంక సునీల్‌, డేగల నాగార్జున, ఆనంద్‌కుమార్‌, పులి శ్రీను, సుభద్రరావు, దొంతిమళ్ల శ్రీను, దినేష్‌, సాకా దాసు, లంక రూపేష్‌, వెలుగొండి గౌరేష్‌, వేణు, దిబ్బ శ్రీను, మళ్ళ గణేష్‌, శిల్పరశెట్టి జగన్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-13T23:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising