9వ తేదీ వరకూ పలు రైళ్లు రద్దు
ABN, First Publish Date - 2023-06-07T01:06:17+05:30
విజయవాడ సమీపాన నూతన రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్‌లు ఏర్పాటు, తదితర సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ వంటి పనులు కారణంగా సామర్లకోట మీదుగా విశాఖ, విజయవాడలవైపు రాకపోకలు సాగించే 12 రైళ్లను ఈనెల 9 వరకూ రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్ సీనియర్ డీవోఎం కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం సామర్లకోట రైల్వేస్టేషన్‌కు ఉత్తర్వులు అందాయి.
విశాఖ-విజయవాడల మధ్య మాత్రమే
సామర్లకోట, జూన్ 6: విజయవాడ సమీపాన నూతన రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్‌లు ఏర్పాటు, తదితర సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ వంటి పనులు కారణంగా సామర్లకోట మీదుగా విశాఖ, విజయవాడలవైపు రాకపోకలు సాగించే 12 రైళ్లను ఈనెల 9 వరకూ రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్ సీనియర్ డీవోఎం కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం సామర్లకోట రైల్వేస్టేషన్‌కు ఉత్తర్వులు అందాయి. వీటిలో విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును 10వ తేదీ వరకూ రద్దు చేసినట్లు తెలిపారు. ఈమేరకు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారి అందించిన సమాచారం ఆంధ్రజ్యోతి సేకరించింది.
విశాఖపట్టణంవైపు
07459 నంబరు గల విజయవాడ-రాజమహేంద్రవరంల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్, నెం.07466 రాజమహేంద్రవరం-విశాఖపట్టణం, నెం.17267 కాకినాడ-విశాఖపట్టణం, నెం.17257 విజయవాడ-కాకినాడ, నెం.17239 గుంటూరు-విశాఖపట్టణంల మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, నెం.22702 విజయవాడ-విశాఖపట్టణంల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.
విజయవాడవైపు
నెం.07460 రాజమహేంద్రవరం-విజయవాడల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్, నెం.07467 విశాఖపట్టణం-రాజమహేంద్రవరం, నెం.17268 విశాఖపట్టణం-కాకినాడ, నెం.17258 కాకినాడ-విజయవాడ, నెం.17240విశాఖపట్టణం-గుంటూరుల మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రె్‌సను ఈనెల 10 వరకూ రద్దు చేశారు.
22701 నంబరు గల విశాఖపట్టణం-విజయవాడల మధ్య నడిచే ఎక్స్‌ప్రె్‌సలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్ కేంద్రంలో సంప్రదించాలని రైల్వే అధికారులు తెలిపారు.
Updated Date - 2023-06-07T01:06:17+05:30 IST