ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పండింది

ABN, First Publish Date - 2023-06-12T01:12:03+05:30

వర్జీనియా పొగాకు పంటకు ఈ ఏడాది మహర్దశ పట్టింది. గత కొన్నేళ్లుగా నష్టాల బాటపట్టిన పొగాకు రైతులకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడంతో కాస్త ఊరట లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిలో పొగాకు గరిష్ఠంగా రూ.232

గోపాలపురం, జూన్‌ 11 : వర్జీనియా పొగాకు పంటకు ఈ ఏడాది మహర్దశ పట్టింది. గత కొన్నేళ్లుగా నష్టాల బాటపట్టిన పొగాకు రైతులకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడంతో కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న వివిధ పరి ణామాలు మెట్ట ప్రాంత రైతులకు ఈ ఏడాది కలిసి వచ్చాయి. పొగాకు కొనుగోలు ప్రారంభం నుంచి గిట్టుబాటు ధర లభిస్తూనే ఉం ది. గతేడాది పొగాకు నాణ్యతను బట్టి వేలం కేంద్రంలో ధర పలికింది. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా నాణ్యత ప్రమాణంతో పని లేకుండా అన్ని గ్రేడుల పొగాకు ఒకే రకమైన ధర పలుకుతూ ఉండడంతో రైతులకు ఉపశమనం లభించినట్లయ్యింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కిలో పొగాకు ధర రూ.232 గరిష్ఠంగా పెరగడం, కనిష్ఠ ధర సరాసరి ధర మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడం రైతులకు కలిసి వచ్చే విషయమే. అయితే గ్రేడ్‌ 1 పొగాకు ధర మాత్రం ఇతర రాష్ర్టాలను పోలి రూ.245లకు కొనుగోలు చేస్తే పెట్టుబడుల నుంచి బయటపడతామని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పొగాకు వేలం కేంద్రం పరిధిలో 1200 మంది రైతులు 2200 బేరన్ల పరిధిలో 10 వేల ఎకరాలు పొగాకు సాగు చేస్తుండగా వేలం కేంద్రంలో ఈ ఏడాది తొమ్మిదిన్నర మిలియన్ల పొగాకు కొనుగోలు చేయాలని బోర్డు అధికా రులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు మిలియన్ల పొగాకును సుమారుగా కొనుగోలు చేశారు.మిగిలిన పొగాకును సరాసరి ధర రూ.240లు పలికేలా కొనుగోలు చేస్తే బాగుంటుందని పొగాకు రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-12T01:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising