తునికాకు దగ్ధం
ABN, First Publish Date - 2023-06-07T01:15:59+05:30
గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తునికాకు బస్తాలను దగ్ధం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన అల్లూరి జిల్లా చింతూరు అటవీడివిజన్ పావురలంక కల్లంలో చోటు చేసుకుంది.
మావోయిస్టులపనా లేక మరెవరైనా?
చింతూరు, జూన్ 6: గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తునికాకు బస్తాలను దగ్ధం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన అల్లూరి జిల్లా చింతూరు అటవీడివిజన్ పావురలంక కల్లంలో చోటు చేసుకుంది. గుత్తేదారులు అటవీశాఖ ఆధ్వర్యంలో ఇటీవల చింతూరు డివిజన్‌లో తునికాకు సేకరించారు. ఈక్రమంలో ఆకు కట్టలను బస్తాలలో కట్టి వాటిని నిర్ధేశిత ప్రాంతానికి తరలిస్తుంటారు. ఇందులోభాగంగా పావురలంక కల్లంలో కూడా 2187 ఆకు కట్టలను 25 బస్తాలలో నింపి తరలించేందుకు సిద్ధం చేశారు. ఆయా ఆకుల బస్తాలను మొత్తం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో అవన్నీ కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న నెల్లిపాకరేంజ్ అధికారి మూర్తి, సెక్షన్ అధికారిణి విజయలక్ష్మి బృందం మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు పాల్పడింది మావోయిస్టులా లేక మరెవరనే విషయంపై అటవీ అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2023-06-07T01:15:59+05:30 IST