ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2023-02-07T01:04:17+05:30

ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్‌ కన్వీనర్లు అందరు నిస్వార్ధంగా కృషి చేసి పోలింగ్‌ బూత్‌ల వద్ద పటిష్టంగా నిలబడాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం రూరల్‌, ఫిబ్రవరి 6: ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్‌ కన్వీనర్లు అందరు నిస్వార్ధంగా కృషి చేసి పోలింగ్‌ బూత్‌ల వద్ద పటిష్టంగా నిలబడాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్యే గోరంట్ల నివాసంలో సోమవారం టీడీపీ రూరల్‌ శ్రేణులకు ఆర్‌టీఎస్‌, ఐటీడీపీ శిక్షణా తరగతులు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా గోరంట్లతోపాటు పార్లమెంట్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ యర్రా వేణుగోపాలరాయుడు విచ్చేశారు. గోరంట్ల మాట్లాడుతూ నేడు సమాజంలో సామాజిక మాధ్యమాల పాత్ర ఎక్కువగా వుందని స్వేచ్ఛగా వారి భావాలను పంచుకుంటున్నారని. ఈ ప్రభుత్వ దారుణాలను ప్రజలందరికీ తెలిసేలా యువత పని చేయాలని సూచించారు. యర్రా వేణు మాట్లాడుతూ ఆర్‌టీఎస్‌ గ్రూప్‌ విధి విధానాలు, దానిని ఏవిధంగా ఉపయోగించాలో వివరించారు. అనతరం ఐటిడీపీ ట్రైనర్‌ జగదీష్‌, వెంకటేష్‌ ఆర్‌టీఎస్‌ గ్రూప్‌ విధివిధానాలు, ఓటరు వెరిఫికేషన్‌ గురించి వివరించారు. ఈ శిక్షణలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, వెలుగుబంటి ప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, మత్య్సేటి శివసత్యప్రసాద్‌, వెలుగుబంటి రఘురామ్‌, మార్నివాసుదేవరావు, గంగిన హనుమంతరావు, నున్నకృష్ణ, కులుకూరి కిషోర్‌, గంగిన నాని, పండూరి అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising