ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చేది టీడీపీ

ABN, First Publish Date - 2023-06-07T00:44:49+05:30

నాలుగేళ్ల జగన్‌ పాలనలో కష్టాలుపడిన ప్రజల భవిష్యత్‌కు టీడీపీ గ్యారెంటీ ఇచ్చి భరోసా కల్పిస్తుందని రాజమహేంద్రవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు.

కేక్‌ కట్‌ చేసి నియోజకవర్గ పరిశీలకుడు అంగరకు తినిపిస్తున్న ఆదిరెడ్డి అప్పారావు చిత్రంలో గన్ని కృష్ణ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 6: నాలుగేళ్ల జగన్‌ పాలనలో కష్టాలుపడిన ప్రజల భవిష్యత్‌కు టీడీపీ గ్యారెంటీ ఇచ్చి భరోసా కల్పిస్తుందని రాజమహేంద్రవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌ బీవీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో మంగళవారం జరిగిన మహానాడు విజయోత్సవ సభలో తొలుత ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్‌కు విశ్వసనీయత లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు సంపద సృష్టించగలరన్నారు. మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ మంత్రుల్లో వణుకు మొదలైంద న్నారు. ఏమీ చేయలేక టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి , ఎమ్మెల్యే బాల ఆంజనేయ స్వామిలపై దాడులకు దిగారని , టీడీపీ నాయకుడి భార్యను హత్య చేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మహానాడుకు వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షలాది మంది కార్యకర్తలు వచ్చి విజయవంతం చేశారని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన పథకాలకు ప్రజల నుంచి స్పందన బాగుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజమహేంద్రవరంలో టీడీపీని ఢీకొట్టడం వైసీపీ వల్ల కాదని స్పష్టం చేశారు. యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వని ఏ రాజకీయపార్టీకి భవిష్యత్‌ ఉండదన్నారు. టీడీపీ కార్యకర్తలకు అగ్రస్థానం కల్పించిందన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు వచ్చి ధైర్యం నూరిపో శారన్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోను వైసీపీ వారే ఎక్కువ ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కేవలం శ్యాంపిల్‌ మాత్రమేనని పూర్తిగా ప్రకటిస్తే వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడిపో తారన్నారు. కాశి నవీన్‌ కుమార్‌,లోహిత్‌ శిష్ట్లా మాట్లాడుతూ మహానాడు విజయవంతంపై దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో చర్చనడుస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్‌గా జగన్‌ మార్చాడని ధ్వజమెత్తారు. జగన్‌ కేవలం 10 నెలలు మాత్రమే సీఎంగా ఉంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టంచేశారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో 1500 మంది కార్యకర్తలకు ,నాయకులకు భోజనాలు పెట్టారు. ఈ సభలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, తెలుగుమహిళ నగర అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ, నక్కా దేవి వరప్రసాద్‌, రవియాదవ్‌, నిమ్మలపూడి గోవింద్‌, చాపల చిన్నరాజు, యాళ్ళ ప్రదీప్‌, కొయ్యల రమణ, బంగారు నాగేశ్వరరావు, ఈతల పాటి రవి, బొర్రా చిన్ని, తురకల నిర్మల, కప్పల వెలుగుకుమారి, షేక్‌ సుభాన్‌, దొండపాటి సత్యం బాబు, బుడ్డిగ రాధా, చాన్‌ బాషా, రెడ్డి మణి , ఉప్పులూరి జానకి రామయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising