ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి నుంచి తూర్పుగోదావరిలోకి టీడీపీ జనచైతన్యయాత్ర

ABN, First Publish Date - 2023-06-26T00:49:17+05:30

టీడీపీ జన చైతన్య బస్సు యాత్ర సోమవారం జిల్లాలోకి ప్రవేశించనున్నది. భవిష్యత్‌కు గ్యారంటీ నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించడానికి చైతన్యయాత్ర పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల27,28 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు మినీ మేనిఫెస్టో పేరిట ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లడంతో పాటు వాటిపై అవగాహన కల్పించడానికి యాత్ర నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

టీడీపీ జన చైతన్య బస్సు యాత్ర సోమవారం జిల్లాలోకి ప్రవేశించనున్నది. భవిష్యత్‌కు గ్యారంటీ నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించడానికి చైతన్యయాత్ర పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల27,28 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు మినీ మేనిఫెస్టో పేరిట ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లడంతో పాటు వాటిపై అవగాహన కల్పించడానికి యాత్ర నిర్వహించనున్నారు.ఈ నెల 20వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు జోన్‌-2 పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలో యాత్ర మొదలైంది. అప్పటి నుంచి యాత్ర కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో యాత్ర ముగించుకుని సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుంచి బయలుదేరి నల్లజర్ల మండలం దూబచర్లలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 5 గంటలకు దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్‌ హాల్‌లో సభ జరుగుతుంది. ఈ యాత్రను 54 మంది టీడీపీ నేతల టీమ్‌ నిర్వహిస్తున్నది. యాత్రకు స్పందన బాగా రావడంతో టీడీపీ నేతల్లో మరింత జోష్‌ పెరిగింది. ప్రతి రోజూ గ్రామాల్లో యాత్ర కొనసాగించి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో యాత్ర సాగుతుందిలా...

తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నుంచి 30వ తేదీ వరకూ టీడీపీ జన చైతన్య బస్సు యాత్ర జరగనున్నది..సోమవారం గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకాతిరుమల నుంచి నల్లజర్ల మండలం మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ర్యాలీగా దేవరపల్లి చేరుకుంటారు. అనంతరం దేవరపల్లి కరుటూరి ఫంక్షన్‌ హాల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. మంగళవారం 27న నిడదవోలు నియోజకవర్గంలో యాత్ర సాగుతోంది. పెరవలి మండలం ముక్కామలలోని జాతీయ రహదారి నుంచి ర్యాలీగా బయలుదేరి ముక్కామల, ఖండవల్లి, అన్నవరప్పాడు గ్రామాల మీదుగా పెరవలి చేరుకుని అక్కడ దీపిక కన్వెన్షన్‌ హాల్‌లో సభ నిర్వహిస్తారు. 28న రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. నాలుగో బ్రిడ్జి సమీపంలోని వెంకటాద్రి ఫంక్షన్‌ హాల్‌లో సభ నిర్వహిస్తారు. వర్షం లేకపోతే ఈ సభను కొంతమూరు గ్రామంలో నిర్వహించే యోచన చేస్తున్నారు. 29న రాజమహేంద్రవరం సిటీలోకి యాత్ర చేరుకుంటుంది. పుష్కరఘాట్‌ నుంచి సీతంపేట వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు. సీతంపేటలో సభ నిర్వహిస్తారు. 30న అనపర్తి నియోజకవర్గంలోనూ బస్సుయాత్ర ఉంటుంది. రంగంపేట మండలంలోని వడిశలేరులో మొదలై బిక్కవోలు మండలం మీదుగా కాకినాడ జిల్లా పెదపూడి మండలంలోని గొల్లలమామిడి గ్రామానికి చేరుకుని అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సభ నిర్వహిస్తారు. జూలై 2న కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గంలోనూ, 3న పిఠాపురం, 4న తుని, 5న ప్రత్తిపాడు, 6న పెద్దాపురం, 7న కాకినాడ సిటీలోనూ యాత్ర జరుగుతుంది. తిరిగి 9న అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. 10న ముమ్మిడివరం, 11న అమలాపురం, 12న, పి.గన్నవరం, 13న రాజోలులో యాత్ర నిర్వహిస్తారు. 14న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. 15న పాలకొల్లు, 16న భీమవరం, 17న ఆచంట, 18న తాడేపల్లిగూడెంలోనూ యాత్ర జరుగుతుంది.

Updated Date - 2023-06-26T00:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising