ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే అన్నివర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధి

ABN, First Publish Date - 2023-08-22T00:35:42+05:30

సమస్యల పరిష్కారానికి కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన అంతర్వేది, ఆగస్టు 21: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సఖినేటిపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం నిరసన చేప ట్టారు. సీఆర్‌ఎంటీ, సీఆర్పీ, అక్కౌంటెంట్‌, ఆఫీసు అటెండ ర్లంతా కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మినిమం టైమ్‌ స్కేలు, జూలై నెల జీతాల బడ్జెట్‌ విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేనిపక్షాన ధర్నా చేపడతామన్నారు. పాద యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చి కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీ బుంగ కిశోర్‌, అక్కౌంటెంట్‌ బెల్లంకొండ రాజబాబు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. దళితవాడలో భూగర్భ జలాలు కలుషితం ఎంపీడీవోకు మహిళల మొర ఆత్రేయపురం, ఆగస్టు 21: ఆక్వా సాగుతో భూగర్భ జలాలు కలుషితమై 100కుటుంబాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయని దళిత మహిళలు సోమవారం ఎంపీడీవో నాతి బుజ్జికి వివరించారు. ఆత్రేయపురం పెదపేటలో అక్రమ రొయ్యల చెరువుల కారణంగా కుళాయిల ద్వారా కలుషిత నీరు వచ్చి ప్రజలు రోగాలబారిన పడుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈనెల17న ఎంపీడీవో కార్యాలయంలో బాధిత కుటంబాలను పిలవకుండా బయట వ్యక్తులను తీసుకువచ్చి ఆక్వా పంటకు గడువు ఇచ్చి చేపల పెంచుకోవడానికి అంగీకరించినట్టు పత్రికల ద్వారా తెలిపారు. దీనిపై ఎంపీడీవోను బాధిత కుటుంబాలు కలిసి వివరించాయి. ఆక్వా చెరువులను మూయించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. మాజీ సర్పంచ్‌ కాలాబత్తుల సీత, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కాలాబత్తుల చిన్నారి పాల్గొన్నారు. కడలి పశువైద్యశాలను ప్రారంభించేదెప్పుడో! ఏడాది క్రితం నిర్మాణం ఇబ్బందులు పడుతున్న పాడిరైతులు రాజోలు, ఆగస్టు 21: రాజోలు మండలం కడలిలో గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నాబార్డు నిధులు రూ.9 లక్షలతో గ్రామీణ పశువైద్యశాల నిర్మాణం పూర్తిచేసి ఏడాది పూర్తయింది. గ్రామీణ పశువైద్యశాలకు చుట్టూ ప్రహరీ నిర్మించి గేట్లు పెట్టించి, రంగులు వేశారు. విద్యుత్‌ సదుపా యం తదితర పనులు పూర్తి చేశారు. సౌకర్యాలు అన్ని కల్పిం చినా గ్రామీణ పశు వైద్యశాలను ఎందుకు ప్రారంభించడం లేదని పాడి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈపశు వైద్యశాలను ప్రారంభిస్తే కడలి, అరవపాలెం, చెన్నడం, వేగివారిపాలెం, బి.సావరం, పాలగుమ్మి గ్రామాల పాడి రైతులకు ఉపయోగ పడుతుంది. పశువైద్యశాల లేకపోవడంతో 5కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నమండ పశువైద్యశాలకు వ్యయ ప్రయా సలతో వెళ్తున్నామని పాడి రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తు తం వర్షాకాలం సీజన్‌ కావడంతో పశువులకు అనేక రకాల వ్యాధులు సోకుతాయని పాడిరైతులు వాపోతున్నారు. ఈ పశువైద్యశాలను ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులు, అధి కారులు చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.

రావులపాలెం, ఆగస్టు 21: అన్నివర్గాల ప్రజలకు ఆర్థిక పురోగాభివృద్ధి కల్పించడంతో పాటురాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో నడిపించే శక్తి టీడీపీకే ఉందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాడులో భవిష్యత్తుకు గ్యారం టీ మహాశక్తి పాదయాత్రను సోమవారం ఆయన ప్రారంభించారు. మహిళలతో కలిసి గ్రామంలో పర్యటించారు. మహాశక్తి పథకం, వైసీపీ ఆరాచక పాలన, టీడీపీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. బండారు అధికారంలోకి రావాలంటూ ఓ వృద్ధురాలు ఆశ్వీరదించింది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి విజన్‌ ఉన్న నాయకుడే సీఎం కావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising