ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పందులకు స్వైన్‌ఫ్లూ

ABN, First Publish Date - 2023-02-07T01:28:27+05:30

పందులకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో చాలా పందులు చనిపోతున్నారు. కడియంలో ఒక పంది, కోరుకొండలో ఒక పందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. దీన్ని వెటర్నరీ వైద్యులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల నుంచి జిల్లాలో పందుల భయం పట్టుకుంది. అసలే పందుల వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఈమధ్యకా లంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల సంచారం విప రీతంగా పెరిగిపోయింది. జిల్లాలో పశుసంవర్ధకశాఖ అఽధికారుల అంచనా ప్రకారం సుమారు 4,600 పందులు ఉన్నాయి. ఇటీవల చాలాచోట్ల పందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో రెండు కేసులు నమోదు

పలుచోట్ల మృతి చెందుతున్న పందులు

పోస్టుమార్టం నివేదికలో వ్యాధి నిర్ధారణ

వ్యాక్సిన్లు వేయిస్తున్నాం : పశుసంవర్ధక శాఖ జేడీ

మనుషులకు సోకే ప్రమాదం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పందులకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో చాలా పందులు చనిపోతున్నారు. కడియంలో ఒక పంది, కోరుకొండలో ఒక పందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. దీన్ని వెటర్నరీ వైద్యులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల నుంచి జిల్లాలో పందుల భయం పట్టుకుంది. అసలే పందుల వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఈమధ్యకా లంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల సంచారం విప రీతంగా పెరిగిపోయింది. జిల్లాలో పశుసంవర్ధకశాఖ అఽధికారుల అంచనా ప్రకారం సుమారు 4,600 పందులు ఉన్నాయి. ఇటీవల చాలాచోట్ల పందులు చనిపోతుండడంతో ఆందోళన మొదలైంది. దీంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మొదట ఈ పందులు ఎందుకు చనిపోతున్నాయో ఎవ రికీ అర్థం కాలేదు. ఫుడ్‌ పాయిజన్‌ అనే అనుమానం వ్యక్త మైంది. ఇటీవల ఫంక్షన్ల వద్ద, హోటళ్లు, ఇళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఇష్టానుసారం పడేయడం వల్ల పందులు తినేస్తున్నాయి. అవేకాకుండా ఊరకుక్కలు, ఆవులు, ఎద్దులు వంటి పశువులు కూడా ఈ ఆహారం మీద ఆధారపడుతున్నాయి. దీంతో కలుషిత ఆహారం వల్ల పందులు చనిపోతున్నట్టు భావిం చారు. ఈ నేపథ్యంలో కడియం, కోరుకొండ మండలాల్లో చనిపోయిన రెండు పందులకు చెందిన కొన్ని భాగాలను విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు పంపి పరీక్ష చేయించారు. ఈ రెండు పందులకు స్వైన్‌ఫ్లూ వచ్చినట్టు తేలింది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలో చనిపోయిన మరో రెండు పందుల శరీర భాగాలను కూడా టెస్టింగ్‌కు పం పారు. కానీ ఇంకా నివేదిక రాలేదు. ఈ వ్యాధికి గురైన పందుల చర్మం మీద విపరీతంతా దద్దుర్లు వస్తాయి. వెంటనేగాని, లేదా మూడు నాలుగు రోజుల్లోనే చనిపోతాయి. వ్యాధికి గురైన పంది చర్మం రంగు ఎరుపు, నీలంగాను మారుతుంది. కాళ్లు, తల కొట్టుకుంటాయి. వ్యాధికి గురైన పందులను ఆరు బయట వదలకూడదు. చనిపోయిన పందులను బహిరంగ ప్రదేశాలు పంట కాల్వలు, డ్రైన్లలో పడేయరాదు. గొయ్యి తీసి అందులో పూడ్చాలి. చనిపోయిన పందుల మాంసాన్ని బయట మార్కెట్‌లో విక్రయించకూడదు. వ్యాధి తగ్గుముఖం పట్టే వరకు పంది మాంసం తినడం ప్రజలకు మంచిదికాదు. పందులు వ్యాధికి గురైన తర్వాత బతకడం కష్టం. వైరస్‌ సోకకుండా పెంపకందారులు పశుసంవర్ధక శాఖ అందించే వ్యాక్సిన్‌ వేయించాలి. పం దులు అనారోగ్యానికి గురైన విషయాన్ని వెంటనే గుర్తించి పశువైద్యులకు తెలియజేయాలి.

వ్యాక్సినేషన్‌ చేస్తున్నాం..

ఇప్పటివరకూ జిల్లాలో 500 పందులకు వ్యాక్సినేషన్‌ వేశామని, మరో 500 డోసులు సిద్ధంగా ఉంచామని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌టీజీ సత్యగోవింద్‌ తెలిపారు. పందుల మృతి నేపథ్యంలో సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. దేవ రపల్లి మండలంలో ఒక ఆసామి 200 పందులు మేపుతున్నాడని, ముందు జాగ్రత్త చర్యగా వాటికి కూడా వ్యాక్సినేషన్‌ వేసిన ట్టు చెప్పారు. స్వైన్‌ఫ్లూ అనేది పం దుల ద్వారానే మనుషులకు సంక్రమించే అవకాశం ఉందని, కానీ జిల్లాలో ఇంతవరకూ ఇటువంటి కేసులు నమోదు ఎక్కడా కాలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు.

ఇప్పటికే ఆవులకు ముద్ద చర్మ వ్యాధి

జిల్లాలో ఆవులకు ముద్దచర్మ (లంపీస్కిన్‌) వ్యాధి విజృంభిస్తోంది. వీటి శరీరం మీద కూడా బొబ్బలు వస్తున్నాయి. చితికిపోయి పుళ్లు పడుతున్నాయి. కొన్నిటికి పురుగులుపట్టి చనిపోతున్నాయి. ఈ వ్యాధి సోకిన వాటిని పాత కబేళాలో స్థలంలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 25 ఆవులకు వ్యాధి సోకింది. కొన్నింటికి తగ్గింది. ఇంకా ఏడు ఆవులకు సమస్య ఉందని పశువర్ధశాఖ అధికారులు తెలిపారు. అయితే అనధికారికంగా పెద్దఎత్తున ఆవులకు ఈ వ్యాధి బారిన పడ్డాయి.

Updated Date - 2023-02-07T01:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising