విద్యార్థులు మత్తు పదార్థాలకు ు బానిసలు కాకుండా చూడాలి
ABN, First Publish Date - 2023-01-29T01:22:08+05:30
విద్యార్థులు ఎటువంటి మత్తు పదా ర్థాల వినియోగానికి బానిసలు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలె క్టర్ హిమాన్షుశుక్లా విజ్ఞప్తిచేశారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆదేశం
అమలాపురం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎటువంటి మత్తు పదా ర్థాల వినియోగానికి బానిసలు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలె క్టర్ హిమాన్షుశుక్లా విజ్ఞప్తిచేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ యాక్షన్ ప్లాన్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నేషనల్ కమి షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పిల్లలు మాదకద్రవ్యాలు వినియోగించకుండా అధికారులు పగడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాకు సంబంధించి డ్రగ్స్ ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందనే అంశాలను పోలీసులు విచా రించి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ వాడకం ఓ ఫ్యాషన్ విధానంగా మారిందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ క్షేత్రస్థాయిలో డ్రగ్స్ నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, శిక్షలు వంటి వాటిని తెలియజేసే ఫ్లెక్స్‌లను పలుచోట్ల ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డీ ఎడిక్షన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లతామాధురి, జిల్లా ఎక్సైజ్ అధికారి నాగేశ్వర్‌రెడ్డి, చైల్డ్ అండ్ వెల్ఫేర్ అధికారి సీహెచ్ వెంకట్రావు, డ్రగ్స్ కంట్రోల్ అధికారి రూపేష్, ఐసీడీఎస్ పీడీ సత్యవాణి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, డీఎస్పీ మాధవరెడ్డి, డీఈవో రవిసాగర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రాపౌవుట్స్ తగ్గించండి..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. పాఠశాలలో పిల్లలు బడికి ఎందుకు రావడం లేదనేది అధ్యయనం చేసి కారణాలు అన్వేషించాలన్నారు. కలెక్టర్ హిమాన్షుశుక్లా, వివిధ శాఖల అధికా రులు సీఎస్‌తో జరిగిన కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి స్పెషల్ డైట్ అందించాల్సిందిగా ఆదేశించారు. అలాగే గర్భిణీలకు పోషకాహారం అందించాలని కోరారు. బాల్య వివాహాలు అరికట్టడానికి మండల స్థాయిలో ఏర్పాటుచేసిన కమిటీలు క్షేత్రస్థాయిలో వాటిని గుర్తించి నిరోధించాలని సూచించారు.
కిట్లు పంపిణీ..
విపత్తు నిర్వహణలో భాగంగా సామర్లకోటలో ఆపదమిత్ర శిక్షణ పూర్తి చేసుకున్న వలంటీర్లు, ఆశావర్కర్లు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు 300 మందికి కలెక్టర్ ప్రత్యేక కిట్లను కలెక్టరేట్‌లో అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన 15 రకాల వస్తువులతో కూడిన కిట్లను ఆపదమిత్రలకు అందించారు. విపత్తుల సమయంలో కిట్లను వినియోగించాల్సిందిగా సూచించారు. విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ జె.వేణుగోపాల్, ఫ్యాకల్టీ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-29T01:22:09+05:30 IST