ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇన్‌చార్జి ఎస్పీగా సతీశ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2023-08-07T01:05:38+05:30

తూర్పుగోదావరి ఇన్‌ చార్జి ఎస్పీగా ఎస్‌.సతీశ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.

రాజమహేంద్రవరం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి ఇన్‌ చార్జి ఎస్పీగా ఎస్‌.సతీశ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వర కూ ఎస్పీగా పనిచేసిన సీహెచ్‌.సుధీర్‌ కుమార్‌ రెడ్డి కర్నాటక క్యాడర్‌ అధికారి. మూడేళ్ల డిప్యూటేషన్‌ ముగియడం.. పోలీస్‌ ఉన్నతాధికారులు ఎంత ప్రయ త్నించినా కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించకపోవడంతో ఆయన కర్నాటక వెళ్లడం ఖాయమైంది. శనివారం రాత్రి సుధీర్‌ని రిలీవ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం కాకినాడ ఎస్పీ సతీశ్‌ కుమార్‌కి బాధ్యతలు అప్పగించారు. కాగా సోమ వారం సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాకు వస్తుం డడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణలో ఎస్పీ సుధీర్‌ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఈ మేరకు మంగళ, బుధవారాల్లో ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. హోం మంత్రి తానేటి వనిత సొంత జిల్లా అయిన తూర్పుగోదావరిలో సుమారు 9 నెలలపాటు పూర్తి స్థాయి ఎస్పీ లేరు. ఇన్చార్జితోనే నడిపించారు. ఎన్నికలవేళ ఎన్నాళ్లకు పూర్తిస్థాయి ఎస్పీ వస్తారనే విష యంపై ఉత్కంఠ నెలకొంది.

==============

Updated Date - 2023-08-07T01:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising