ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-03-05T00:12:59+05:30

రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రితోపాటు ఏపీ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ కోరారు.

డాక్టర్‌ రమేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న అసోసియేషన్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు నాయకుల వినతిపత్రం

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 4: రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రితోపాటు ఏపీ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ కోరారు. ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌కు అసోసియేషన్‌ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సిబ్బంది పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారన్నారు. ఫారిన్‌ సర్వీసు డిప్యుటేషన్‌లో ఉన్న సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు లేవని తెలిపారు. సిబ్బందికి క్యాంటీన్‌ సౌకర్యం కల్పించాలని, స్టాఫ్‌ సిక్‌ రూం ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ వైద్యవిఽధాన పరిషత్‌లోని అనేక ఆసుపత్రుల్లో పురుషులు, మహిళా సిబ్బందికి వాష్‌ రూమ్‌లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పారామెడికల్‌, క్లాస్‌ 4 స్టాఫ్‌కు రెండేళ్ల నుంచి యూనిఫామ్స్‌ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆశీర్వాదం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయశ్రీ, వీవీ శ్రీనివాసరావు, లలిత, గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising