ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదిలింది రామదండు..

ABN, First Publish Date - 2023-03-31T00:54:10+05:30

జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌ నినాదాలతో రాజమహేంద్రవరం మారుమ్రోగింది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున శోభాయాత్ర నిర్వహించారు.

పుష్కరఘాట్‌ వద్ద శోభాయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 30 : జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌ నినాదాలతో రాజమహేంద్రవరం మారుమ్రోగింది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. పుష్కరఘాట్‌ వద్ద సభ నిర్వహించిన అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ జరిపారు. శ్రీకాకుళం సాధుపరిషత్‌ స్వామీజీ శ్రీనివాసానంద ఉద్వేగంతో మాట్లాడారు. భారతదేశం పుణ్యభూమి, ధన్యభూమి, త్యాగభూమి అని, శ్రీరాముడు నడయాడిని పుణ్యభూమి అని కీర్తించారు. రాబోయే రోజుల్లో హిందూ ధర్మాన్ని ఎవరు ప్రోత్సహిస్తారో, హిందూ ధర్మాన్ని ఎవరు గౌరవిస్తారో వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మన హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టాలని, హిందూ మనోభావాలను కాపాడేవారిని ఆదరించాలని అన్నారు. హిందూ వ్యతిరేకులకు చోటివ్వకండి అని స్పష్టం చేశారు. ఈ సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, బీజేపీ నాయకులు, పలు హైందవ సంస్థల ప్రతినిధులు, మద్దతుదారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising