ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణపై మౌనమెందుకో!

ABN, First Publish Date - 2023-02-07T01:00:35+05:30

ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్‌ మౌనం వెనుక ఆంతర్యమేమిటని ఏపీ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరుపో గుల వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏపీ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

గోపాలపురం, ఫిబ్రవరి 6: ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్‌ మౌనం వెనుక ఆంతర్యమేమిటని ఏపీ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరుపో గుల వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవ రణలో ఆయన సోమవారం విలేకర్లతో మట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తుండగా వర్గీకరణకు సహకరించాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారని, నాటి నుంచి నేటి వరకు నోరు మెదపడం లేదన్నారు. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనంలో అంబే డ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, అక్కడే బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం వెనుక మర్మ మేమిటో సీఎం జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌లను ముఖ్యమంత్రి కులాలకు అపాదిస్తున్నారని ఆయన విమర్శిం చారు. ఉపకులాల మధ్య జగన్‌ నిర్ణయాలు చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయ న్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను మాలలకు కట్టబెట్టి మాది గలపై సవతి ప్రేమ వలకబోస్తున్నారని, రానున్న ఎన్నికల్లో మాదిగలు గుణ పాఠం చెబుతారన్నారు. ఉపకులాల మధ్య చిచ్చుపెట్టే సీఎం జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌ హాలులో దళిత, గిరిజన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. స్మృతి వనంలో అంబేడ్కర్‌ విగ్రహం పక్కనే బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరాజు మాదిగ, కార్యనిర్వా హక కార్యదర్శి సుజన్‌రావు మాదిగ, కోఅర్డినేటర్‌ కొడవటి బుజ్జిబాబు మాదిగ, జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి రాంబాబు మాదిగ, సలీం పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising