ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్పీపై చర్యలు తీసుకుంటాం

ABN, First Publish Date - 2023-06-26T01:09:39+05:30

జిల్లా పోలీసులు దళితుల పట్ట కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ధ్వజమెత్తారు.

రాజమహేంద్రవరంలో మాట్లాడుతున్న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 25: జిల్లా పోలీసులు దళితుల పట్ట కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ధ్వజమెత్తారు. తిరుమలాయపాలెం గ్రామానికి నిత్యావసరాల తరలింపును అడ్డుకున్న సంఘటన తెలుసుకున్న ఆయన ఆదివారం రాజమహేంద్రవరం వచ్చి దళిత పోరాట కమిటీ నాయకుడు అజ్జరపు వాసు ఇంటికి వెళ్ళారు. సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను ఆదుకునేందుకు వెళుతుంటే అడ్డంకులు ఎందుకు సృష్టించారని పోలీసులను ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ ఆది నుంచి దళిత వ్యతిరేకిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ గతంలో రావులపాలెంలో టిఫిన్‌ తినే పేపరు ప్లేట్‌లో అంబేడ్కర్‌ పొటో వేసినందుకు ఆ వ్యాపారిని దళిత యువకులు నిలదీస్తే ఆ యువకులపై కేసులు పెట్టి వేధించార న్నారు. ఇప్పుడు తిరుమలాయపాలెం ఘటనలో దళితులపై దాడు లు చేయడమేకాకుండా బాధితులను ఆదుకునేందుకు వెళుతున్న వారిని అరెస్టులు చేశా రన్నారు. దీనిని ఎస్సీ కమిషన్‌ క్షమించదని హెచ్చరించారు.ఎస్పీపై తగు చర్య లు తీసుకుంటామని చెప్పారు.తిరుమలాయపాలెం దళితులపై దాడులు చేసిన పెత్తందార్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట కాశి నవీన్‌ కుమార్‌, మర్రి బాబ్జి,పరమట గణేశ్వరరావు,భానుచందర్‌, జువ్వల రాం బాబు, రాంబాబు ,బొర్ర చిన్ని, కప్పల వెలుగు కుమారి, ఖండవల్లి లక్ష్మి, తాళ్ళూ రి బాబు రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, విజ్జిన మధు ఉన్నారు. వారంతా నిత్యావసర సరుకులు తీసుకుని తిరుమలాయపాలెం వెళ్ళారు.

Updated Date - 2023-06-26T01:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising