ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సత్యదేవుడి సాక్షిగా ఒక్కటైన జంటలు

ABN, First Publish Date - 2023-09-04T00:44:19+05:30

రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధి ఆదివారం నవదంపతులతో కళకళలాడింది. శనివారం రాత్రి సత్యదేవుడి సాక్షిగా ఒక్కటైన జంటలతో పాటు వివిధ ప్రాంతాల్లో వివాహం చేసుకున్న జంటలతో రద్దీ నెలకొంది.

నూతన వధూవరులతో రత్నగిరి రద్దీ

ఆదివారం ఒక్కరోజు సుమారు 4వేల వ్రతాలు

వివిధ విభాగాల ద్వారా రూ.50 లక్షల ఆదాయం

అన్నవరం, సెప్టంబరు 3: రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధి ఆదివారం నవదంపతులతో కళకళలాడింది. శనివారం రాత్రి సత్యదేవుడి సాక్షిగా ఒక్కటైన జంటలతో పాటు వివిధ ప్రాంతాల్లో వివాహం చేసుకున్న జంటలతో రద్దీ నెలకొంది. దీంతోపాటుగా ఆదివారం సెలవుదినం కావడంతో సాధారణ భక్తులు స్వామిదర్శనానికి విచ్చేశారు. రద్దీని దృష్టి లో ఉంచుకుని 4గంటల నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రా రంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఈవో ఆజాద్‌ ప్రత్యేకచర్యలు తీసుకున్నారు. స్వామివారి ప్రత్యేకదర్శనానికి రెండుగంటలు, ఉచితదర్శనానికి మూడుగంటలు భక్తులు వేచియున్నారు. సత్యదేవా నిత్యాన్నదాన పథ కం ద్వారా సుమారు 4వేల మందికి ఉచిత అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆదివారం ఒక్కరోజు సుమారు 4వేల వ్రతాలు జరుపగా వివిధ విభాగాల ద్వారా సుమారు రూ.50లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

సత్యదేవుడి సన్నిధిలో ప్రముఖుల పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావులు వేర్వేరుగా కుటుంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో ఆజాద్‌ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఈవో వారికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఆర్వో లక్ష్మీనారాయణ, రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌ భాస్కరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

లోవకు పోటెత్తిన భక్తులు

ఆలయానికి రూ.3.51లక్షల ఆదాయం

తునిరూరల్‌, సెప్టెంబరు 3: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తు లు ప్రత్యేక క్యూలైన్‌లో బార్లుతీరి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించు కున్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో కొండ దిగువ ప్రైవేట్‌ వ్యక్తులు వసతి గదులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ఆరుబయట వంటావార్పులు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. లోవకి తరలివచ్చిన భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.3.51లక్షల ఆదాయం దేవస్థానానికి సమకూరినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు.

భీమేశ్వరాలయానికి శ్రీరాముని పాదుకలు

ద్రాక్షారామ, సెప్టెంబరు 3: అయోధ్య శ్రీరామ మందిరానికి సమర్పించు శ్రీరాముని దివ్య పాదుకలను ఆదివారం ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తీసుకు వచ్చారు. పాదుకలను ఊరేగింపుగా ఈవో పి.టి.వి.సత్యనారాయణ, ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకువచ్చారు. భక్తులు సందర్శనార్థం ఆలయ ప్రాంగణంలో ఉంచారు. అధిక సంఖ్యలో భక్తులు పాదుకలను దర్శించుకున్నారు.

Updated Date - 2023-09-04T00:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising