ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలి..విడిగా!

ABN, First Publish Date - 2023-01-18T00:28:34+05:30

సంక్రాంతి అంటే ఏమిటి?కోడి పందేలు..గుం డాట.. పేకాట.. ఇంతేనా? నాటి సరదా ఏమైంది.. కుటుంబంతో సరదాగా గడిపే ఆ రోజులు ఏమైపో యాయి..

కొవ్వూరులో కోడి పందేల బరి వద్ద సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నివాసాల్లో అంతంతమాత్రమే పండగ

కానరాని నాటి సంప్రదాయం

ఆనందమే లేదంటున్న పెద్దలు

బరుల వద్దే సంక్రాంతి సందడి

గుండాట, పేకాటతో సరి

బోసిపోయిన పల్లె వీధులు

పిండి వంటలూ రెడీమేడ్‌

కిటకిటలాడిన దుకాణాలు

సంక్రాంతి అంటే ఏమిటి?కోడి పందేలు..గుం డాట.. పేకాట.. ఇంతేనా? నాటి సరదా ఏమైంది.. కుటుంబంతో సరదాగా గడిపే ఆ రోజులు ఏమైపో యాయి.. జనంలో ఎంతలా మార్పు వచ్చిందంటే పెద్ద పండుగ అంటూ అంతా ఊరు బాట పడుతున్నారు.. ఇంట్లో పిల్లలు ఫోన్లకు అతుక్కు పోతుం టే..మహిళలు టీవీలకు అతుక్కుపోతున్నారు.. మగవారున్నారంటే కోడిపందేలు.. పేకాట.. గుండాట.. మూడు రోజులు సంక్రాంతి ఎక్కడ ఉందంటే కేవలం కోడి పందేల బరులు ఎక్కడ ఉంటే అక్కడే. ఒకనాడు ఏ గ్రామంలో ఏ వీధి చూసినా పండుగలా ఉండేది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకూ అంతా వీధిలోనే ఉండేవారు. వచ్చి పోయే వారిని పలకరిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారు. నేడు ఆ ఆనందమే కరువైంది.. పండుగకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలిసి విడిగా ఉంటున్నారు.

పెరవలి, జనవరి 17: పండుగలన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి. అటువంటి పండుగకు గతంలో ఉండే ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రస్తుతం మారిన కాలమానం పరిస్థితులను బట్టి నూతన పోకడలతో నాటి సంప్రదాయాలు అన్ని పక్కన పెట్టి నామమాత్రంగా పండుగను జరుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ నాలుగు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒకొక్క రకమైన సాంప్రదాయపద్ధతిలో గతంలో పండుగలు జరుపుకునేవారు. పండుగ సమీపిస్తుందనే సరికి దూర ప్రాంతాల్లో ఉండే బంధువులు, స్నేహితులు ఆయా కుటుంబాల్లోని సభ్యులు తమ తమ సొం తూర్లకు చేరుకుని ఆనందంగా పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ప్రస్తుత త్రీడీ యుగంలో బంధువులంతా పండుగకు వస్తున్నారు.. అయితే వెళ్లామా.. వచ్చామా అన్న రీతిలో పండుగ గడిచిపోతుంది. గ్రామాల్లో గతంలో కాలం నుంచి గంగిరెడ్లు, హరిదాసులు, వివిధ రకాల జాన పద కార్యక్రమాలకు చోటు లేకుండా పోయింది. పండుగ సందర్భంగా ఆట పాటలు లేకుండా పోయాయి. ప్రస్తుత సెల్‌ఫోన్‌ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్‌ ఫోన్‌తో ఫొటోలు తీసుకోవడం, అవి ఒకరి నుంచి ఒకరికి పంపుకోవడం, గేమ్‌లు ఆడుకోవడం వీటితోనే రోజంతా కాలక్షేపం అయిపోతుంది.ఇంటిలో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం వంటివి లేకుండా పోయాయి. ఏదో అందరూ జరుపుకుంటున్నారు.. కదా మనం కూడా జరుపుకుందాం అనే రీతిలో వాతావరణం కొనసాగుతోంది. అదే రకంగా ప్రస్తుత పండుగ ముగిసింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల హడావుడిలో ఎవరు ఉద్యోగాలకు వెళ్లడానికి వారు సిద్దమై సొంతూర్ల నుంచి ప్రయాణమై వెళుతున్నారు. గతంలో ఉన్నట్లుగా ఇళ్ల వద్ద పండుగ వాతావరణం మాత్రం పెద్దగా కనపడలేదని పలువురు పెద్దలు అభిప్రాయం పడుతున్నారు. ప్రతి ఇంటిలోనూ సంప్రదాయ వంటలు కూడా వండడం లేదని రేడీమేడ్‌గా షాపుల నుంచి కొనుగోలు చేసుకుని పండుగ కానిచ్చేస్తున్నారు. పూర్వం తాము తిన్న ఆహార పదార్ధాలు ప్రస్తుతం మచ్చుకైనా కానరావడం లేదని ఇపుడన్ని కొత్త కొత్త రుచులతో తమకు ఇష్టం లేకపోయినా తినాల్సి వస్తుందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ అంటే కోడిపందేలు ఆడే వారికి మాత్రమే పండుగలా మారింది. ఒక వైపు పోలీసులు కోడిపందాలు ఆడనీయమంటూ పండగ ముందు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి పండుగ మూడు రోజులు మాత్రం తప్పనిసరిగా ఆయా గామ్రాల్లో కోడి పందేలు ఆడి తీరుతున్నారు. కొంత మందికి కాలక్షేపంగానూ, డబ్బులు సంపాదించేవిగానూ ఉన్నప్పటికి ఎక్కువ మంది మాత్రం భారీ మొత్తంలో నష్టపోతున్నారు. ఈ మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్లు చేతులు మారాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసు కోవచ్చు. గతంలో గ్రామాల్లో సరదాగా డింకీ పందేలు వేసుకునేవారు.. కాసేపు కాలక్షేపం చేసేవారు. నేడు అలా కాదు ఆ మూడు రోజులు పందేలకే అంకితమై పోతున్నారు. అనేక చోట్ల గొడవలు,కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. మందుబాబుల మూడు రోజులు ఫుల్‌ గా మందు కొట్టి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం గతంలో ఉన్న పం డుగ సంప్రదాయాలు పక్కకు పోయాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

Updated Date - 2023-01-18T00:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising