ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర భూసర్వే అంతా తప్పులతడకలే తహశీల్దారు కార్యాలయంవద్ద టీడీపీ ధర్నా

ABN, First Publish Date - 2023-01-25T01:01:57+05:30

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా మారిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో గొల్లప్రోలు తహసీల్దారు కార్యాల యం వద్ద మంగళవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లప్రోలు, జనవరి 24: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా మారిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో గొల్లప్రోలు తహసీల్దారు కార్యాల యం వద్ద మంగళవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ సమగ్ర సర్వే చేపట్టామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా వాస్తవంలో రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. సర్వే అంతా లోపభూయిష్టతంగా జరిగిందని, రైతుల భూముల్లో ఉన్న విస్తీర్ణంలో 5సెం ట్లు నుంచి 10 సెంట్లకుపైగా తక్కువ చూపిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారని చెప్పారు. రైతులకు తమ అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. రెవెన్యూ రికార్డులు, రైతులు వద్ద ఉన్న దస్తావేజులు, అడంగల్స్‌ పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా సర్వేచేయడం ఏమిటని వర్మ ప్రశ్నించారు. తప్పులతడకగా వచ్చిన రైతుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారు వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఆందోళనలో టీడీపీ పట్టణ, మండలశాఖల అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, నాయకులు గుర్రం సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising