ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సత్యదేవుడికి అధిక భారం జీతభత్యాలే

ABN, First Publish Date - 2023-09-20T02:02:33+05:30

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి ఆల యంలో అధిక భారం జీతాభత్యాలదే. దీంతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపు లు నానాటికీ తగ్గిపోతున్నాయి. రద్దీకి అనుగుణంగా జరగాల్సినంత అభివృద్ధి ఇక్కడ కానరావడం లేదు.

ఏటా రూ.55.83 కోట్లు చెల్లింపు

అన్నవరం, సెప్టంబరు 19: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి ఆల యంలో అధిక భారం జీతాభత్యాలదే. దీంతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపు లు నానాటికీ తగ్గిపోతున్నాయి. రద్దీకి అనుగుణంగా జరగాల్సినంత అభివృద్ధి ఇక్కడ కానరావడం లేదు. దీనిపై అధ్యయనం చేస్తే రూపాయి రాకపోక ఎలా జరుగుతుం దో అర్థమైంది. ఇటీవల ఈవో చంద్రశేఖర ఆజాద్‌ దేవస్థానంలో ఎంతమంది రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేసేవారు ఎందరు, వీరందరికీ నెలవారీగా జీతాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు అనే విషయాలపై ఒక జాబితా తయారుచేయించారు. దీనిలో పరిపాలనా విభాగం కింద సెక్యులర్‌ 139, రెలిజియస్‌ 92, కాంట్రాక్ట్‌ పద్ధతిలో 187 మంది, ఔట్‌సోర్సింగ్‌లో 89మందితో కలిపి 509 మంది పనిచేస్తున్నారు. వీరికి నెలవారీగా జీతాల రూపంలో 2,13,20, 593 చెల్లిస్తున్నారు. వీరితోపాటుగా శానిటేషన్‌ పనివారు 322 మందికాగా వీరికి దేవస్థానం నిదులు నుంచి నెలకు రూ.45,59,938 ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ ద్వారా అంద జేస్తున్నారు. వ్రతపురోహితులు 257 మంది పనిచేస్తుండగా వీరికి వ్రతంటిక్కట్లపై 40 శాతం కమిషన్‌ ద్వారా నెలకు రూ.1,06,10,360 ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇక కేశఖండనశాలలో 72 మంది విధులు నిర్వహిస్తుండగా వీరికి ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటుచేసిన నాయిబ్రాహ్మణ సంక్షేమసంఘం తరుపున నెలకు రూ. 13,17,421 చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. భద్రతా విదులుకు సంబంధించి హోంగార్డు లు 37, ఎస్‌పీఎఫ్‌ 13, ప్రైవేట్‌ సెక్యూరిటీ 75 మందికి నెలకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. వీటితోపాటుగా ఆగమ పాఠశాల, దేవస్థానం హైస్కూల్‌, జూనియర్‌, డిగ్రీకళాశాలల్లో గంటల పరిమితి, రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌లలో 56 మంది పనిచేస్తున్నారు. అన్నవరం దేవస్థానం ఆద్వర్యంలో దత్తత దేవాలయాలుగా 7 ఆలయాలు నడుస్తుండగా వీటిలో 29 మంది పనిచేస్తూ నెలకు రూ. 3.36 లక్షలు జీతాల రూపంలో పొందుతున్నారు. మొత్తం 1423 మంది ఉద్యోగులకు ఏటా రూ.55.83 కోట్లు చెల్లిస్తున్నారు. వీరితోపాటుగా పదవీవిరమణ అనంతరం పెన్షన్‌ పొందుతున్న 243 మంది పెన్షనర్స్‌కు ఏటా రూ. 8.56 కోట్లు వారి ఖాతాల కు దేవస్థానం ఖజానా ద్వారా కేవలం జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఔట్‌సోర్సింగ్‌ నియామకాలను రాజకీయ ఒత్తిడితో గత పాలకులు విచ్చలవిడిగా నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామివారికి వచ్చే ఆదాయంలో సుమారు 40శాతం జీతాల రూపంలో పోతున్నా యి. ప్రసాదం తయారీకి, ఇతర అవసరాలకు రసవర్గములు, ద్రవ్యములు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టాలి. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.

Updated Date - 2023-09-20T02:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising