ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజానగరం టీడీపీ ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి

ABN, First Publish Date - 2023-07-21T00:28:32+05:30

రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా బొడ్డు వెంకటరమణ చౌదరి నియ మితులయ్యారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాజానరం, జూలై 20 : రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా బొడ్డు వెంకటరమణ చౌదరి నియ మితులయ్యారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ దాదాపు ఆరు నెలల కిందట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి ఖాళీగా ఉంది. అయితే పెందుర్తి రాజీనామా విషయమై అధిష్ఠానం తటస్థ వైఖరి అవలంబించింది. గతంలో చంద్రబాబు మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన సందర్భంలో కలిశారు. మే నెలలో నిర్వహించిన టీడీపీ మహానాడు, ఇటీవల జరిగిన బస్సు యాత్రలో కూడా పెందుర్తి యఽథావిధిగా పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా కొత్తవారిని నియమించాలంటూ పెందుర్తితో సహా పలువురు టీడీపీ నాయకులు గత కొంతకాలంగా కోరుతున్న క్రమంలో అధిష్ఠానం బొడ్డు వెంకటరమణ చౌదరినిరాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది.

Updated Date - 2023-07-21T00:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising