వాన.. మునక!
ABN, First Publish Date - 2023-08-22T01:20:31+05:30
రాజమహేంద్రవరం, ఆగస్టు 21: వానొచ్చిందంటే రాజమహేంద్రవరం అసలు రంగేమిటో తేలిపోతుంది. నేతలు చెప్పే హైటెక్ సొగసుల బండారం బయటపడుతుంది. గట్టిగా ఓ గంట వాన పడితే ముఖ్యమైన రోడ్లు సైతం మునిగి పోతాయి. డ్రెయినేజీలు బంద్ అయిపోతాయి. హైటెక్ బస్టాండ్ గురించి చెప్పాల్సిన పనిలే
రాజమహేంద్రవరం, ఆగస్టు 21: వానొచ్చిందంటే రాజమహేంద్రవరం అసలు రంగేమిటో తేలిపోతుంది. నేతలు చెప్పే హైటెక్ సొగసుల బండారం బయటపడుతుంది. గట్టిగా ఓ గంట వాన పడితే ముఖ్యమైన రోడ్లు సైతం మునిగి పోతాయి. డ్రెయినేజీలు బంద్ అయిపోతాయి. హైటెక్ బస్టాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం కురిసిన వర్షానికి పలు రోడ్లు జలమయం అయ్యాయి. అటు జాతీయ రహదారిలోనూ అదే దుస్థితి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో 216 జాతీయ రహదారిలో సీఐడీ కార్యాలయం వద్ద హైవేతోపాటు పక్కన సర్వీసు రోడ్డు పెద్ద చెరువులా మారి పోయిన దృశ్యమిది.
Updated Date - 2023-08-22T01:20:31+05:30 IST