ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోస్టల్‌.. సేవలు డల్‌!

ABN, First Publish Date - 2023-08-17T01:11:13+05:30

పోస్టల్‌ సేవల్లో ఆలస్యంతో వినియోగదారులు విసి గిపోతున్నారు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి ఇటు కోనసీమ జిల్లా ద్రాక్షారామ వరకూ పోస్టల్‌ డివిజన్‌కి ప్రధాన కార్యాలయం రాజమహేంద్రవరంలో ఉంది.

రాజమహేంద్రవరం హెడ్‌ పోస్టాఫీస్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : పోస్టల్‌ సేవల్లో ఆలస్యంతో వినియోగదారులు విసి గిపోతున్నారు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి ఇటు కోనసీమ జిల్లా ద్రాక్షారామ వరకూ పోస్టల్‌ డివిజన్‌కి ప్రధాన కార్యాలయం రాజమహేంద్రవరంలో ఉంది.ఇంత పెద్ద పో స్టాఫీసులో సేవలు రోజురోజుకు ఆలస్యం అవుతున్నాయి. కౌంటర్లు ఉంటాయి కుర్చీలే ఖాళీగా దర్శనమిస్తాయి. దీంతో తమ పని ముగించుకొని వెళ్లడానికి గంటల కొద్దీ సమయం పడుతుండడంపై వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రికరింగ్‌ డిపా జిట్‌ (ఆర్డీ) రద్దు చేసుకొని డబ్బులు తీసుకోవాలంటే నరకం కనిపిస్తోందని చెబుతు న్నారు.పోస్టాఫీస్‌లో వినియోగదారులకు వివిధ సేవలందిం చడానికి 7 కౌంటర్లు ఉన్నాయి. సేవింగ్స్‌ బ్యాంకు కౌంటర్లు 3, రిజిస్టర్డ్‌ పోస్ట్‌ 2, ఆధార్‌ 1, స్టాంప్స్‌ విక్రయానికి 1 కేటా యించారు. వీటిలోని రెండు మూడు కౌంటర్లలో ఎప్పుడూ ఖాళీగా దర్శనమిస్తాయి.వినియోగదారులు ఎక్కువగా ఉన్నా అంతే. మూడు సేవింగ్స్‌ బ్యాంకు కౌంటర్లలో రెండే వినియోగిస్తున్నారు. వీటిలో ఒక కౌంటరులో మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఎంత మంది వచ్చినా ఆ కౌంటర్‌ వద్ద లైన్‌లో నిలబడాల్సిందే.. మరొకరు కనీసం సమా ధానం చెప్పరు. పోస్టాఫీస్‌కి వస్తే ఆలస్యమవుతుండ డంపై విని యోగదారులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. వాస్తవానికి జనం ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్‌ ఆఫీసులోని సిబ్బందిని కౌంటర్లకు వేయాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. దీంతో పోస్టాఫీ సుకు వచ్చే వాళ్లకి నిరీక్షణ తప్పడం లేదు. వినియోగదారులకు సహాయం చేయడానికి ఒక ఉద్యోగిని అందుబాటులో ఉంచుతున్నా ఆ సేవల టేబుల్‌ తెలియడం లేదు. మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకు భోజన విరామంలో అన్ని కౌంటర్లూ ఒకే సారి మూసేస్తున్నారు. గంట దాటాక 2 గంటలకు ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో ఎవరైనా వృద్ధులు ఉంటే అటు భోజ నానికి వెళ్లలేక, కౌంటరు వద్ద ఆకలితో ఉండలేక ఇబ్బంది పడుతు న్నారు.పోస్టల్‌ సేవింగ్స్‌ బ్యాంకు, ఆర్డీ తదితర సేవ లకు సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కువసేపు నిరీక్షించాల్సి రావ డంతో చాలా ఇబ్బంది పడుతున్నారు.సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఒక ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

ఆర్డీ రద్దుకు గంటల సమయం

రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడు హెడ్‌ పోస్టాఫీస్‌లో ఆర్డీ ఖాతా తెరిచాం. తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయాం. ఆర్డీ రద్దుచేసి డబ్బులు తీసుకెళదామని ఉదయం 10.30 గంటలు దాటాక పోస్టాఫీస్‌కి వచ్చా. డబ్బులు చేతికొచ్చేసరికి మధ్యాహ్నం దాటేసింది. ఇలాగైతే ఎలా.. ఈ నాటికి పోస్టల్‌ సేవల్లో వేగం పెరగలేదు. వినియోగదారులకు సంతృప్తినిచ్చే విధాన మూ అలవాటు చేసుకోవడం లేదు.

- హైదరాబాద్‌ నుంచి వచ్చిన మహిళ ఆవేదన

Updated Date - 2023-08-17T01:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising